“బ్రేకింగ్”...కోహ్లీ “ఖాతా”లో మరో “రికార్డ్”

Bhavannarayana Nch

క్రికెట్ ప్రపంచంలో ఒకప్పుడు రికార్డులు అంటే సచిన్ పేరే గుర్తుకు వస్తుంది..అయితే సచిన్ క్రికెట్ నుంచే తప్పుకున్న తరువాత ఆ స్థాయిలో ఆడగల సత్తా ,తెగువ , ఇప్పుడు కోహ్లీ అంది పుచ్చుకున్నాడు భారత్ తరుపున రికార్డులు సృష్టించడానికి ఎవరూ లేరు అనుకున్న సమయంలో  కోహ్లీ వచ్చాడు రికార్డుల మీద రికార్డులు తిరగ రాస్తున్నాడు..

 

ఎన్నో రికార్డులు చేసిన కోహ్లీ తాజాగా మరొక రికార్డుని సొంత చేసుకున్నాడు..ఐపీఎల్‌ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఒకే ఒక్క జట్టుకు ఆడుతున్న ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ప్రతీ సీజన్‌లోనూ ఆటగాళ్లు మారిపోతున్నా కోహ్లీ మాత్రం 11 సీజన్లుగా బెంగళూరుకే ఆడుతున్నాడు...2008లో ఐపీఎల్ ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరుకే ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లీ..విజయాలతో జట్టుని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వస్తున్నాడు..

 

 

2008లో కోహ్లీ బెంగళూరు ఫ్రాంచైజీ కొనుగోలు చేయకముందు  అదే సంవత్సరం భారత్‌కు అండర్-19 ప్రపంచకప్ అందించాడు  ఆ తర్వాత భారత జట్టులోకి ప్రవేశించాడు. తొలి వేలంలోనే బెంగళూరు ఫ్రాంచైజీ కోహ్లీని దక్కించుకుంది. జట్టులోకి వచ్చినప్పటి నుంచి మరింత రాటుదేలుతూ వస్తున్న కోహ్లీ....మెల్ల మెల్లగా బెంగళూరు   జట్టుకు సారధిగా భాద్యతలు స్వీకరించాడు...2016 సీజన్‌లో కోహ్లీ 16 మ్యాచ్‌లు ఆడి 973 పరుగులు సాధించాడు.

 

అయితే ఆ సీజన్ లో కోహ్లీ ఖాతాలో నాలుగు సెంచరీలు ఉండడం గమనార్హం...81 సగటుతో 152 స్ట్రైక్ రేట్‌తో నాలుగు సెంచరీలు, 7 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. అందులో 83 బౌండరీలు, 38 సిక్సర్లు ఉన్నాయి..ఆయితే కోహ్లీ మాత్రం ఐపీఎల్ ఆరంభం నుంచి ఒకే ఒక్క జట్టుకు ఆడుతున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: