సింధూర్: భారత్ - పాక్ యుద్ధం.. ఐపీఎల్ పై ఎఫెక్ట్..?
ప్రస్తుత పరిస్థితులలో ఐపీఎల్ మ్యాచ్ల పైన ఎలాంటి ప్రభావం చూపవని కూడా తెలియజేస్తున్నారు బీసీసీఐ. మొదట భారత్లో 2008లో ఐపీఎల్ ప్రారంభమై ఇప్పటికి సక్సెస్ఫుల్గా కొనసాగుతోంది. ఇక 2009లో ఇండియాలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్న వేల భద్రత సమస్యలు తలెత్తుతాయని చెప్పడంతో మొదటిసారి దక్షిణాఫ్రికాలో నిర్వహించారట. మళ్లీ ఆ తర్వాత 2014లో లోక్సభ ఎన్నికలు రావడం చేత.. కొన్ని రోజులు షెడ్యూల్ని యూఏఈ లో జరిపించారు. 2020లో కరోనా మహమ్మారి కారణం చేత ఈ టోర్నమెంట్ ని యూఏఈ లో మార్చారు.
ఇక 2021లో ఐపీఎల్ టోర్నమెంట్ ఇండియాలో జరిగింది. ఇక 2022లో కూడా ప్రేక్షకులు లేకుండానే ఈవెంట్ కొనసాగింది. 2023 నుంచి మళ్లీ ఎక్కువగా భారతదేశంలోని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఈ ఉద్రిక్తతలు నేపథ్యంలో భద్రతాపరమైన ఇబ్బందులు లేకుండా పలు రకాల చర్యలు చేపడుతున్నారట.
అయితే ఈ విషయం పైన బీసీసీఐ తెలియజేస్తే.. ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారమే యధా విధంగా మ్యాచులు కొనసాగిస్తామని ఆపరేషన్ సింధూర్ ప్రభావం పడకపోవచ్చు అంటూ తెలియజేశారు. కానీ పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రంలో జరిగేటువంటి పంజాబ్ ఇతరత్రా మ్యాచ్లు ఢిల్లీకి మార్చే అవకాశం ఉందంటూ తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా సింధూర్ ఆపరేషన్ తో పాకిస్తాన్ కి గట్టి కౌంటర్ ఇచ్చింది ఇండియా.