అసలేం జరుగుతుంది.. మరో అమ్మాయితో చాహల్.. విడాకులకు కారణం అదేనా?
ఈ క్రమంలోనే తాజాగా యూజీకి సంబంధించి మరో వార్త నెట్టింట సెగలు పుట్టిస్తోంది. ముంబైలోని జేడబ్ల్యూ మారియల్ హోటల్‌లో ఓ మిస్టరీ గర్ల్‌తో చహల్ కనిపించగా హోటల్ నుంచి బయటకు వచ్చే సమయంలో కెమెరా మేన్స్ తమ టాలెంటు చూపించారు. ఇక వారిని చూసి తన ముఖానికి చేతులు అడ్డుపెట్టుకున్నాడు చాహల్. చహల్ ముందు సండుస్తుండగా.. అమ్మాయి అతడి వెనకాల ఉండడం ఇక్కడి ఫొటోలో చూడవచ్చు. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడంతో అసలు దొంగ చాహల్ ఏమో అని జనాలు చెవులు కొరుక్కొంటున్నారు.
ఇందుకంటే కెమెరా కంటపడకుండా ఉండేందుకు యూజీ నానా ఇబ్బంది పడడంతో ఇద్దరి మధ్య సమ్‌థింగ్, సమ్‌థింగ్ ఉందనే కధనాలు ఇపుడు మీడియాలో కోకొల్లలుగా ప్రచురితం అంటున్నాయి. ఇక ఆ మిస్టరీ గర్ల్ పేరు తనిష్క కపూర్ అని చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఆమె కన్నడలో 2-3 సినిమాల్లో నటించింది. ధనశ్రీ వర్మతో పరిచయం కాకముందే.. చహల్, తనిష్కలు డేటింగ్ చేసినట్లు గుసగుసలు కూడా వినబడుతున్నాయి. కాగా ఈ వార్తలను అప్పట్లో యూజీ ఖండించగా ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యాడు. పెళ్లి తర్వాత కూడా తనిష్కతో చహల్ సీక్రెట్ అఫైర్ నడిపిస్తున్నాడని తాజాగా అర్ధమవుతోంది. ఇక ఈ కారణంగానే చహల్, ధనశ్రీ మధ్య గొడవలు మొదలయ్యాయనే వాదను కూడా ఉంది. చహల్ వ్యవహారం నచ్చకనే ధనశ్రీ విడాకులు ఇచ్చేందుకు సిద్దమైందని తెలుస్తోంది.