అతని వల్లే ఎన్నోసార్లు గెలిచాం.. అతన్నెలా తప్పుబడతాం: రోహిత్

praveen
మెల్ బోర్న్ బాక్సింగ్ డే టెస్ట్ లో ఇండియా 184 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్ ఆట తీరుపై కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా స్పందించారు. రిషబ్ పంత్ తన ఆటలో రిస్క్ శాతాన్ని గుర్తించాలని సూచించాడు. అతని నుంచి ఏమి అవసరమో అర్థం చేసుకొని ఆడాలంటూ కామెంట్స్ చేసాడు. అదే సమయంలో రోహిత్ శర్మ రిషబ్ పంత్ ని వెనకేసుకు రావడం కొసమెరుపు. రోహిత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ... "మేము చాలా నిరాశ చెందాం. అయితే ఆఖరి ఇన్నింగ్స్ ఆడటం అనేది అంత తేలిక కాదు. ఓటమి వలన మేము ఖచ్చితంగా నేర్చుకుంటాం. పంత్ అవుట్ అయ్యాక మాకు ఓటమి ఖాయం అనిపించింది. అలాగని అతని ఆటని తప్పు పట్టలేము. ఎన్నోసార్లు ఈఆటతోనే మమల్ని గెలిపించారు. ఏదేమైనా ఇక సిడ్నీలో గెలవడంపై దృష్టి పెడతాము." అని చెప్పుకొచ్చాడు.
ఇకపోతే, బాక్సింగ్ డే టెస్ట్ లో రిషబ్ పంత్ 28 పరుగులు చేశాడు. ఫీల్డర్ ఉన్నా అటు వైపు షాట్ కొట్టి చాలా ఫన్నీగా ఔటయ్యాడు. దీనిపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఇదీ ఏమి ఆటా? అంటూ దెబ్బలాడడం మనం గమనించవచ్చు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు.. అక్కడ ఫీల్డర్లు ఉన్నప్పుడు అటు వైపే షాట్ ఎలా ఆడతావు అంటూ అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు కూడా. ఇక రెండో ఇన్నింగ్స్ లో కూడా పంత్ నిర్లక్ష్యంగా ఆడినట్లు చాలా స్పష్టంగా కనిపించింది. పార్ట్ టైమ్ బౌలర్ హెడ్ బౌలింగ్ రిషబ్ పంత్ ఔటయ్యాడు. దీంతో కష్టాల్లో ఉన్నప్పుడు పంత్ వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పేలవమైన ప్రదర్శనని చేస్తున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పేలవ ప్రదర్శన చేస్తున్న క్రమంలో రోహిత్ శర్మ కూడా ఇదేరకమైన అవమానాలు ఎదుర్కొంటున్నాడని చెప్పుకోవచ్చు. ఈ సిరీస్‌లో తొలి టెస్టు ఆడని రోహిత్ శర్మ ఆ తర్వాత ఆడిన 3 టెస్టుల్లోనూ కలిపి 31 రన్స్ మాత్రమే స్కోరు చేయడం చాలామందికి మింగుడు పడలేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 3, 6, 10, 3, 9 స్కోర్లు నమోదు చేయడంతో సగటు 6.2గా నమోదైంది. జైశ్వాల్‌, నితీశ్‌ రెడ్డి లాంటి యువ ప్లేయర్లు రాణిస్తున్న ఇదే పిచ్‌లపై.. రోహిత్ మాత్రం దారుణమైన పరుగులు చేయడం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అతడి తీరు మార్చుకోవాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: