అతి చేసిన ఆసిస్ ఫ్యాన్.. కింగ్ కోహ్లీకి అవమానం?

praveen
అవును, మీరు విన్నది నిజమే. రన్నింగ్ మెషీన్, టీమిండియా మాజీ కెప్టెన్ ని ఆసీస్‌ అభిమానులు తీవ్రస్థాయిలో అవమానించారు. రెండో రోజు ఆటలో ఈ ఘటన చోటు చేసుకోవడం విచారకరం. విషయంలోకి వెళితే... కోహ్లీ ఆట తీరు గురించి జనాలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రీజులో ఉన్నంతసేపు ఏకాగ్రతతో బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో 86 బంతుల్లో (4 ఫోర్లు) 36 రన్స్ చేయడం జరిగింది. అయితే ఆరంభంలో ఆఫ్‌సైడ్‌ బంతులను అవాయిడ్ చేసి, చాలా జాగ్రత్తగా ఆడిన కోహ్లీ చివరకు వచ్చేసరికి కాస్త తడబడుతూ పెవిలియన్‌ బాటపట్టాడు. ఈ క్రమంలో బోలాండ్‌ వేసిన ఆఫ్‌ సైడ్‌ బంతిని కదిలించి వికెట్‌ కీపర్‌ చేతికి చిక్కి అవుట్ అయ్యాడు.
ఈ నేపథ్యంలో, యశస్వి జైస్వాల్ (82)తో కలిసి కోహ్లీ మూడో వికెట్‌కు 102 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే, జైస్వాల్ రనౌట్‌కాగానే సహనం కోల్పోయిన కోహ్లీ ఔట్‌సైడ్ ఆఫ్‌స్టంప్ బంతిని కెలికి మరీ వికెట్‌ కీపర్‌ చేతికి చిక్కాడు. దాంతో ఔటైన అనంతరం డ్రెస్సింగ్‌ రూమ్‌ వైపు వెళుతూ ఉండగా... కోహ్లీని కొంతమంది ఆసీస్‌ ఫ్యాన్స్‌ ఎగతాళి చేశారు. తమ మాటలతో, కోహ్లీని రెచ్చగొట్టారు. ఇక ఆ మాటలు విన్న కోహ్లీ బాగా ఇబ్బందిపడి తీవ్ర ఆగ్రహంతో వెనక్కి వచ్చి వారిపైపు సీరియస్‌గా చూశాడు. దీన్ని గమనించిన భద్రతా అధికారి కోహ్లీకి నచ్చజెప్పి లోపలికి తీసుకెళ్లడం జరిగింది.
కాగా ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా కోహ్లీ పట్ల ఆసీస్‌ అభిమానులు ప్రవర్తించిన తీరును భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా సతీమణి సంజనా గణేశన్‌ చాలా తీవ్ర స్థాయిలో ఖండించారు. యావత్ దేశంలోనే అత్యుత్తమ బ్యాటర్‌ పట్ల ఇది అమర్యాదకరమైన ప్రవర్తన! ఆసీస్ క్రికెట్ బోర్డు దీనిని సీరియస్ గా తీసుకోవాలి. క్రమశిక్షణా రాహిత్యము కింద అతనికి తగిన బుద్ధి చెప్పాలి! అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆటగాళ్లపై విమర్శలు చేయొచ్చు కానీ.. అది హద్దులు దాటకూడదు! అని ట్విటర్ (ఎక్స్‌) వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాచ్‌ విషయానికొస్తే, 2వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 164/5 స్కోరు చేసింది. రిషభ్ పంత్ (6*), రవీంద్ర జడేజా (4*) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 474 పరుగులు చేయగా టీమ్‌ఇండియా ఇంకా 310 పరుగుల వెనకంజలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: