
మొదట ఎన్టీఆర్..ఆ తర్వాత బన్నీ..ఇప్పుడు ప్రభాస్..ఈ హీరోలకి ఏమైంది రా నాయనా..?
సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ కూడా నెగిటివ్ రోల్స్ లో కనిపించడానికి ఇష్టపడుతున్నారు . మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో బాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ షేడ్స్ పాత్రలో కనిపించబోతున్నారు . వార్ 2 సినిమాలో పూర్తిగా నెగిటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు . అయితే ఇప్పుడు బన్నీ కూడా అదే తరహా ఉన్న పాత్రలో కనిపించబోతున్నారట. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం సంజయ్ లీల భన్సాలీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారట .
అయితే ఇది బన్నీ నెగటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నారు అంటూ టాక్ వినిపిస్తుంది. ఒక విధ్మగా చెప్పాలి అంటే విలన్ అనే అర్ధం. అంతేకాదు ప్రభాస్ సైతం ఇప్పుడు ఒక నెగిటివ్ షేడ్స్ పాత్రను ఓకే చేశారట . బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో సినిమాలో నెగిటివ్ పాత్రలో కనిపించడానికి ఓకే చేశారట . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు అల్లు అర్జున్ - రెబల్ స్టార్ అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ ల పేర్లు వైరల్ అవుతున్నాయి . ఇక త్వరలోనే రామ్ చరణ్ కూడా ఈ లిస్ట్ లోకి ఆడ్ అయిపోతాడు అని ..బాలీవుడ్ నుంచి పిలుపు రాగానే కా పరిగెత్తుకుంటూ నెగిటివ్ షేడ్స్ చేస్తాడు అని జనాలు ఫన్నీగా కౌంటర్స్ వేస్తున్నారు..!