'తగ్గేదేలే' అంటున్న నితీష్ కుమార్!

praveen
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ (2024-25)లో వేదికగా టీమిండియా యువ క్రీడాకారుడు, ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఎక్కడా తగ్గడం లేడు. అన్ని బ్యాటింగ్ ఈ సిరీస్‌కే ఉత్తమమైందిగా నిలిచింది. మెల్‌బోర్న్ టెస్టులో కూడా ఈ వైజాగ్ కుర్రాడు అదే మాదిరిగా ఆడడం అందరికీ తెలిసిందే. కాగా మెల్‌బోర్న్ టెస్టులో 3వ రోజు బ్యాటింగ్‌కు దిగే సమయానికి టీమిండియా 191 పరుగులకే 6 వికెట్లు కోల్పోవడం గమనార్హం. అయితే... లంచ్ సమయానికి నితీష్ కుమార్ టీమ్ ఇండియా స్కోరును జెట్ స్పీడుతో పరుగెత్తించాడు. ఈ క్రమంలో 244 పరుగులు సాధించింది. ఈ క్రమంలో తన పేరిట ఒక ప్రత్యేక రికార్డును కూడా సృష్టించాడు.
విషయంలోకి వెళితే... మెల్‌బోర్న్ టెస్టులో 3వ రోజు లంచ్ చేసే సమయానికి నితీష్ కుమార్ రెడ్డి 61 బంతుల్లో 40 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 1 సిక్స్ నితీష్ కొత్తగా... సిక్సర్ చాలా ప్రత్యేకమైనదిగా కనబడింది. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి ఈ సిరీస్‌లో 8వ సారి సిక్స్ కొట్టడం విశేషం. దీంతో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అత్యధిక సిక్సర్ల సంఖ్యను సమం చేసినవాడిగా రికార్డు నమోదు చేసాడు. అదే సమయంలో, ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌లో ఇన్ని సిక్సర్లు బాదిన భారతదేశం తరపున తొలి బ్యాట్స్‌మెన్‌గా నితీష్ కుమార్ రెడ్డి నిలవడం గమనార్హం.
అయితే నితీష్ కుమార్ రెడ్డి కంటే ముందు ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఇద్దరు బ్యాట్స్‌మెన్స్ మాత్రమే ఇన్ని సిక్సర్లు కొట్టగలిగారని మీకు తెలుసా? 2002-03 యాషెస్ సిరీస్‌లో మైఖేల్ వాన్ 8 సిక్సర్లు కొత్తగా... అదే సమయంలో, క్రిస్ గేల్ 2009-10 ఆస్ట్రేలియా పర్యటనలో ఒక టెస్ట్ సిరీస్‌లో 8 సిక్సర్లు బాదాడు. ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి ఈ ఘనత సాధించడం విశేషంగానే చెప్పుకోవచ్చు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో నితీష్ కుమార్ రెడ్డి 200 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో 200 పరుగుల మార్క్‌ను అందుకున్న మూడో భారతీయుడిగా నిలవడం గర్వకారణం.
అసలు విషయం ఏమంటే... ఈ క్రమంలో మ్యాచ్ లోని సీనియర్లు ఫెయిల్ అయినా నితీష్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో బోలాండ్, కమిన్స్, స్టార్క్ వంటి భయంకరమైన బౌలర్లను ఎదుర్కొంటూ... హాఫ్ సెంచరీ పూర్తి చేసి వారెవ్వా అనిపించాడు ఈ విశాఖపట్నం కుర్రాడు. అంతేకాదండోయ్... 'పుష్పరాజ్' స్టైల్ మార్క్ మేనరిజం కనబరిచి అభిమానులను అలరించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: