వరుసగా నాలుగు ఓటమిలు.. ఇండియా WTC ఫైనల్ చేరాలంటే?
డబ్ల్యూటీసీ (వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్) 2023-25 సైకిల్ ఫైనల్ చేరుకొనే క్రమంలో టీమిండియాకు పలురకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు భారత్, ఆస్ట్రేలియా ఫైనల్ రేసులో ఉండగా, ఇప్పుడు తాజాగా దక్షిణాఫ్రికా డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌కు చేరుకోవడం సర్వత్రా ఉత్కంఠతకు దారితీస్తోంది. సొంత గడ్డపై శ్రీలంకతో జరిగిన 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను సౌతాఫ్రికా క్లీన్ స్వీప్ చేసిన సంగతి విదితమే. ఈ క్రమంలోనే తాజాగా 2వ టెస్టులో 143 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు చేరుకునే అవకాశాలను పెంచుకుంది.
ఈ విజయంతో డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ ప్లేస్‌కు చేరుకున్న సౌతాఫ్రికా, ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే మొదటి 2 స్థానాల్లోనే సీజన్‌ను ముగించే అవకాశం లేకపోలేదు. అలాగైతే టీమిండియా ఆశలు ఆవిరి అయినట్టే. ఆదివారం అడిలైడ్ ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన పింక్ బాల్ టెస్టులో కూడా ఓడిపోవడంతో టీమిండియా ఆశలు భారీగా దెబ్బతిన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం డబ్ల్యూటీసీ సైకిల్లో టీమిండియా 57.29 పాయింట్స్ పర్సంటేజ్‌తో 3వ స్థానానికి పడిపోయినట్టు తెలుస్తోంది.
ఇటువంటి తరుణంలో టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ఒకింత కష్టమనే చెప్పుకోవాలి. అయితే అదే సమయంలో అసాధ్యం కాదని మాత్రం ఇక్కడ చెప్పాలి. ప్రస్తుతం ఐదు టెస్టులు గెలిచిన సౌతాఫ్రికా 63.33 పర్సంటేజ్‌తో టాప్‌లో ఉండగా, ఆస్ట్రేలియా 60.71 పర్సంటేజ్‌తో సెకండ్ ప్లేస్‌లో ఉన్నాయి. భారత్ సమీకరణాలు ఒకసారి పరిశీలిస్తే... భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో మరో 3 మ్యాచ్‌లు దాకా ఉన్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్ డైరెక్ట్‌గా అర్హత సాధించాలంటే, మిగిలిన 3 మ్యాచ్‌ల్లో గెలిచి ఆస్ట్రేలియాపై 4-1తో సిరీస్ సొంతం చేసుకోవలసి ఉంటుంది. బోర్డర్ గవాస్కర్ సిరీస్‌ను భారత్ కనీసం 3-2 తేడాతో ఆస్ట్రేలియాపై గెలిస్తే.. మొత్తం 146 పాయింట్లు, 64.05 పాయింట్స్ పర్సంటేజ్ సాధిస్తుంది. అప్పుడు రేసులో ఆస్ట్రేలియా, భారత్‌ను దాటి ముందుకెళ్లలేదు. దీంతో WTCలో భారత్‌కు ఫైనల్ బెర్త్ లభిస్తుందన్నమాట. చూడాలి మరి ఏమవుతుందో?