ఆడింది 6 మ్యాచులే.. కానీ అంతలోనే భారత క్రికెటర్ రిటైర్మెంట్?
2008లో విరాట్ కోహ్లి నాయకత్వంలో అండర్-19 వరల్డ్ కప్‌ను గెలుచుకున్న టీం లో కూడా సిద్ధార్థ్ కౌల్ ప్రతిభ కనబరిచాడు. ఆ తర్వాత ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు 2016లో ట్రోఫీని తెచ్చిపెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ వంటి జట్లకు కూడా ఆయన ఆడాడు. 55 ఐపీఎల్ మ్యాచ్‌లలో 58 వికెట్లు తీశాడు. కానీ, 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్‌లో ఎవరూ ఆయన్ని కొనుగోలు చేయకపోవడంతో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాల్సి వచ్చింది.
సిద్ధార్థ్ కౌల్ తన క్రికెట్ జీవితం గురించి ఎమోషనల్ పోస్ట్ చేశాడు. "పంజాబ్‌లో చిన్నప్పుడు క్రికెట్ ఆడుతున్నప్పుడు భారతదేశం తరఫున ఆడాలని కలలు కనేవాడిని. 2018లో నా కల నిజమైంది. టీ20లో 75వ క్యాప్‌ను, వన్డేలో 221వ క్యాప్‌ను అందుకున్నాను" అని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన కుటుంబం, జట్టు సహచరులు, బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపాడు. తన కెరీర్‌లో ఎదురైన ఎత్తుపల్లాల గురించి కూడా ప్రస్తావించాడు. తన భవిష్యత్తు గురించి మాట్లాడుతూ, క్రికెట్ జీవితం నుంచి నేర్చుకున్న పాఠాలతో ముందుకు సాగుతాను అని చెప్పాడు. తన క్రికెట్ జీవితం గురించి ఎప్పటికీ గర్విస్తానని అన్నాడు.