రిషబ్ పంత్ కి రూ.27 కోట్లు.. కానీ చేతికి వచ్చేది ఎంతో తెలుసా?
రిషభ్ పంత్‌కు ఈ భారీ కాంట్రాక్ట్ లభించడం అతని కెరీర్‌లో ఒక మైలురాయి. ముఖ్యంగా, గత సంవత్సరం అతను ప్రమాదంలో పడి, చాలా కష్టపడి కోలుకున్న తర్వాత ఈ విజయం అతనికి మరింత ప్రత్యేకమైనది. 2022లో ఒక భయంకరమైన కారు ప్రమాదంలో చిక్కుకున్న పంత్, చాలా చికిత్స తీసుకున్న తర్వాత తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అద్భుతంగా తిరిగి వచ్చాడు. ఇప్పుడు అతను మార్చి 14న ప్రారంభమయ్యే ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు.
రిషభ్ పంత్‌కు లభించిన కాంట్రాక్ట్ అమౌంట్ వాల్యూ రూ. 27 కోట్లు అయినప్పటికీ, అతను చేతికి వచ్చే మొత్తం కొద్దిగా తక్కువ. భారత ప్రభుత్వం అతని నుండి రూ. 8.1 కోట్లు పన్నుగా తీసుకుంటుంది. అంటే, పన్నులు కట్టిన తర్వాత పంత్‌కు ప్రతి సీజన్‌కు రూ. 18.9 కోట్లు మిగులుతాయి. ఈ అమౌంట్ కూడా చాలా ఎక్కువే అని చెప్పుకోవచ్చు. అతను తన టాలెంట్ కారణంగానే ఈ రేంజ్ కి చేరుకున్నాడు.