దుమ్ములేపిన తెలుగోడు.. ఐసీసీ ర్యాంకింగ్స్ లో దూసుకొచ్చాడుగా?
దక్షిణాఫ్రికాలో తన బ్యాట్‌తో సంచలనం సృష్టించిన తిలక్ వర్మ మరోసారి వార్తలలో నిలిచాడు. తాజాగా ప్రకటించిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో తిలక్ వర్మ మూడో స్థానానికి చేరుకున్నాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో తిలక్ వర్మ 3వ స్థానానికి చేరుకున్నాడు. 69 మంది ఆటగాళ్లను ధాటి తిలక్ వర్మ నంబర్ 3 స్థానానికి చేరుకోవడం పెద్ద విషయం. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ముందు తిలక్ వర్మ 72వ స్థానంలో ఉన్నాడు. కానీ సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు చేసిన తర్వాత అతని ర్యాంకింగ్ ఇప్పుడు 3 కి చేరుకుంది.
ఇకపోతే, తిలక్ వర్మ లాగే సంజూ శాంసన్ కూడా దక్షిణాఫ్రికాతో జరిగిన టి20 సిరీస్‌లో 2 సెంచరీలు సాధించాడు. అయితే, సంజు రెండుసార్లు 0 వద్ద ఔట్ అయ్యాడు. దీని కారణంగా అతను టి20 ర్యాంకింగ్స్‌లో భారీగా నష్టపోయాడు. మొత్తానికి ప్రస్తుతం సంజూ శాంసన్ 22వ స్థానంలో ఉన్నాడు. 2 సెంచరీలు సాధించగా 17 మంది బ్యాట్స్‌మెన్‌లను దాటుకొని ఈ స్థానాన్ని సాధించడం పెద్ద విషయం.
మరోవైపు, తిలక్ వర్మ కొంతకాలంగా టీమ్ ఇండియాకు దూరమైనా దక్షిణాఫ్రికా సిరీస్‌లో అవకాశం దక్కించుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ తన కెప్టెన్సీలో అతనికి 3వ నంబర్‌లో ఆడే అవకాశం ఇచ్చాడు. తిలక్ దాని ప్రయోజనాన్ని పొందాడు. ఈ 22 ఏళ్ల బ్యాట్స్‌మన్ మొదట సెంచూరియన్‌లో 107 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత జోహన్నెస్‌బర్గ్‌లో కూడా అతను అజేయంగా 120 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో తిలక్ వర్మ 140 సగటుతో 280 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో తిలక్ 20 సిక్స్‌లు, 21 ఫోర్లు కొట్టాడు. అతని స్ట్రైక్ రేట్ కూడా 198.58. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ 3లో అడుగుపెట్టడానికి ఇదే కారణం.
ఒకప్పుడు టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న సూర్యకుమార్ యాదవ్.. ఇప్పుడు తిలక్ వర్మ కంటే కూడా దిగువకు పడిపోయాడు. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ 4వ స్థానంలో ఉన్నాడు. సౌతాఫ్రికా సిరీస్‌లో సూర్య ఏమాత్రం బ్యాటింగ్ సరిగా చేయలేదు. ఈ ఆటగాడు 3 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 26 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతని సగటు 9 కంటే తక్కువగా ఉంది. ఫలితంగా భారత టి20 కెప్టెన్ ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో నష్టపోయాడు. టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్‌కు మరో శుభవార్త అందింది. హార్దిక్ పాండ్యా ప్రపంచ నంబర్ 1 టీ20 ఆల్ రౌండర్‌గా నిలిచాడు. అతను ఇంగ్లాండ్‌కు చెందిన లియామ్ లివింగ్‌స్టన్‌ను దాటి ఈ స్థానానికి చేరుకొన్నాడు..