ఐపీఎల్ కు షాక్ ఇవ్వబోతున్న పాక్ బోర్డు.. ఏం చేయబోతుందంటే?
కొన్ని నివేదిక ప్రకారం.. ఆటగాళ్ల లభ్యత, ప్రసార షెడ్యూల్‌కు సంబంధించి PCB తమకు స్పష్టత ఇవ్వాలని యజమానులు కోరుతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL), పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) మధ్య ఘర్షణ ఏర్పడితే మేము ఏ ఆటగాళ్లను పొందుతామని, ఈ సమస్యను పీసీబీ సరిగా ఎదుర్కోలేకపోవడంతో ఫ్రాంచైజీ యజమానులు ఆందోళన చెందుతున్నారు.
ఇది ఇలా ఉండగా.. ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు అలాగే మరికొన్ని బోర్డులు తమ ఆటగాళ్లు లీగ్‌లో ఆడటంపై నిషేధం గురించి మాట్లాడుతున్నాయి. కాబట్టి, వారు PSL ఆటగాళ్ల డ్రాఫ్ట్‌కు ముందు స్పష్టత కోరుతున్నారు. PSL సాధారణంగా ఫిబ్రవరి-మార్చిలో జరుగుతుంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సాంప్రదాయ PSL విండోలో నిర్వహించబడుతుంది. దింతో PSL ఏప్రిల్-మేలో నిర్వహించబడుతుంది. వచ్చే ఏడాది మార్చి నుంచి మే వరకు ఐపీఎల్ సాధారణ షెడ్యూల్‌ను కొనసాగిస్తుందని భావిస్తున్నారు. ఈ వారాంతంలో సౌదీ అరేబియాలో ఐపీఎల్ మెగా వేలం జరగబోతుందన్న వాటాదారుల్లో ఆందోళన నెలకొంది. వేలం తర్వాత చాలా మంది కీలక అంతర్జాతీయ ఆటగాళ్లు PSL ఆడటానికి అందుబాటులో ఉండరు.
దీనీహా మొత్తానికి వచ్చే ఏడాది పాకిస్థాన్ సూపర్ లీగ్‌ను IPL సమయంలో నిర్వహించాలని పాక్ క్రికెట్ బోర్డు ఆలోచిస్తుంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఉండటంతో IPL జరిగే మార్చి-మే సమయంలోనే PSLను జరపాలని PCB భావిస్తున్నట్లు ప్లాన్ చేస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే అగ్రస్థాయి విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండరని ఫ్రాంచైజీలు ఓ లేఖలో బోర్డు వద్ద ఆందోళన వ్యక్తం చేసాయి.