గెలిచే మ్యాచ్లో ఓటమి.. కెప్టెన్ సూర్య కుమార్ రియాక్షన్ ఇదే?

praveen
టీమిండియాకు అసలు ఏమైంది.. మొన్నటి వరకు మూడు ఫార్మాట్లలో కూడా అద్భుతమైన విజయాలు సాధించిన టీమిండియా.. ఇప్పుడు ఎందుకు తడబడుతుంది. మొన్నటికి మొన్న సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో క్లీన్ స్వీప్ అయింది టీమ్ ఇండియా. కనీసం ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా తో జరుగుతున్న టి20 సిరీస్లో అయినా గెలిచి కాస్త అభిమానులకు ఉపశమనాన్ని కలిగిస్తుందని అందరూ అనుకున్నారు.

 అనుకున్నట్లుగానే మొదటి మ్యాచ్ లో ఘనవిజయాన్ని అందుకుంది టీమిండియా. కానీ రెండో మ్యాచ్లో ఏకంగా గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయింది. 125 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో  డీల పడిపోయింది. దీంతో అభిమానులు అందరూ కూడా మరింత నిరాశ పడిపోయారు. టీమిండియాకు ఏమైంది అనే ప్రశ్న ప్రతిచోట కూడా వినిపిస్తుంది. అయితే ఇటీవల సౌత్ ఆఫ్రికా తో జరిగిన రెండవ టి20 మ్యాచ్ లో ఓటమిపై కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం వల్లే భారత జట్టు ఓడిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు. బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారూ అంటూ ప్రశంసలు కురిపించాడు.

 మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అసాధారణ బౌలింగ్ తో జట్టును విజయ తీరాల వైపుకు నడిపించేందుకు ప్రయత్నించాడు. టీ20లలో 125, 140 స్కోర్లతో గెలవడం కష్టమే. కానీ మా బౌలర్ల పోరాట పటిమని చూసి గర్వపడుతున్నాం. 125 పరుగుల లో స్కోరింగ్ లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో ఒకే బౌలర్ ఐదు వికెట్లు తీయడం నిజంగా గొప్ప విషయం. వరుణ్ చక్రవర్తి అది సాధించి చూపించాడు. ఈ మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ మరో రెండు మ్యాచ్లు ఉన్నాయి. వాటిని గెలిచే ప్రయత్నం చేస్తాం. అయితే ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 124 పరుగులు మాత్రమే చేసింది. హార్థిక్ పాండ్యా అక్షర్ పటేల్ పరవాలేదు అనిపించగా.. మిగతా అందరు బ్యాట్స్మెన్లు విఫలమయ్యారు. తర్వాత లక్ష్య చేదనలో కాస్త తడబడినట్లు కనిపించిన సౌత్ ఆఫ్రికా.. ఆ తర్వాత పుంజుకుని అద్భుత విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: