వార్ని ఆర్సిబి కెప్టెన్ కోహ్లీ కాదా.. మరి ఎవరు?
ఈ క్రమంలోనే ఈ మెగా వేలానికి ముందు అటు అన్ని టీమ్స్ రిటెన్షన్ ప్రక్రియను కూడా పూర్తి చేసుకున్నాయ్. అయితే కొన్ని టీమ్స్ ఏకంగా కెప్టెన్లను సైతం వేలంలోకి వదిలేసాయి అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక ఆయా జట్లకు కొత్త కెప్టెన్ గా ఎవరూ రాబోతున్నారు అనే విషయంపై కూడా ఉత్కంఠ నెలకొంది. కాగా అటు ఐపిఎల్ లో ఒక్క టైటిల్ గెలవక పోయినప్పటికీ ఛాంపియన్ టీమ్స్ రేంజ్ లో పాపులర్ ని సంపాదించుకున్న ఆర్సిబి జట్టు కూడా ఏకంగా కెప్టెన్ గా కొనసాగుతున్న డూప్లెసిస్ ను వేలంలోకి వదిలేసింది. దీంతో ఆ జట్టుకు కొత్త కెప్టెన్ ఎవరు అనే విషయంపై చర్చ జరుగుతుంది. కాగా మరోసారి విరాట్ కోహ్లీ చేతికే కెప్టెన్సీ పగ్గాలు రాబోతున్నాయి అంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి.
అయితే ఇలా రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టు కెప్టెన్గా విరాట్ కోహ్లీ బాధ్యతలు చేపడుతాడు అనే ప్రచారం జరుగుతున్న వేళ.. ఆ జట్టు డైరెక్టర్ మొ బోబోట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్రాంచైజీ ఇంకా కెప్టెన్సీ నిర్ణయం తీసుకోలేదు. మాకు ఇంకా ఆప్షన్లు ఉన్నాయి. మా పాత కెప్టెన్ డూప్లెసెస్ ను మేము రిటైన్ చేసుకోలేదు. అతడు గత ఏడాది జట్టును ఎంతో సమర్థవంతంగా నడిపించాడు. వేలంలో ఓపెన్ మైండ్ తో ఆలోచిస్తాం అంటూ మొ బాబోట్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇక ఆర్సిబి కొత్త కెప్టెన్ ఎవరు అనే విషయం మరింత తీవ్రతరం అయింది.