ఇలా అయితే కష్టమే.. కోహ్లీ రిటైర్మెంట్ కి సమయం ఆసన్నమైందా?

praveen

శనివారం జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్ జట్టు చేతిలో 113 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ పూణెలో జరిగింది. ఈ ఓటమితో భారత జట్టు 18 టెస్ట్ సిరీస్‌ల విజయాల పరంపర ముగిసింది. భారత జట్టు గత 18 మ్యాచ్‌లుగా వరుసగా గెలుస్తూ వచ్చింది, కానీ ఈ మ్యాచ్‌లో దారుణంగా ఓడిపోయి టీమ్ ఇండియా ఫ్యాన్స్ కు తీవ్ర నిరాశను మిగిల్చింది. ఇక న్యూజిలాండ్ జట్టు గురించి చెప్పాలంటే, వారు భారతదేశంలో దాదాపు 70 సంవత్సరాల తర్వాత తమ మొదటి విజయాన్ని సాధించారు.
ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు బౌలర్ మిచెల్ సాంటనర్ చాలా బాగా ఆడాడు. భారత జట్టు బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెట్టి, మొత్తం 13 మందిని ఔట్ చేశాడు. టీమిండియాలో యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా అనే ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే కాస్త బాగా ఆడారు. కానీ, మిగతా ఆటగాళ్లు అంత బాగా ఆడలేకపోయారు. అందుకే భారత జట్టు ఓడిపోయింది. స్టార్ ప్లేయర్లైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా ఇటీవల జరిగిన క్రికెట్ మ్యాచ్‌లలో వీరిద్దరూ బాగా ఆడలేకపోతున్నారు.
ఈ మ్యాచ్‌లో కోహ్లీ 0 మరియు 8 పరుగులు మాత్రమే చేశాడు. రోహిత్ శర్మ కూడా 1, 17 పరుగులకే ఔట్ అయ్యాడు. టీమిండియా న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఒక మ్యాచ్ ఓడిపోయగా, ఈ పరిస్థితిలో కోహ్లీ, రోహిత్ బాగా ఆడాలని అభిమానులు ఆశించారు. కానీ వారు బాగా ఆడకపోవడంతో భారత జట్టు మరో మ్యాచ్ కూడా ఓడిపోయింది. మన జట్టు 12 ఏళ్లలో సొంత గడ్డపై ఓడిపోవడం ఇదే మొదటిసారి.
కోహ్లీ, రోహిత్ చెత్త పర్ఫామెన్స్ చూసిన ఫాన్స్ రిటైర్ అయిపోయింది అంటూ ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. కొంతమంది వీరు టెస్ట్ క్రికెట్‌ను వదిలివేయాలని అంటున్నారు. మరికొంతమంది వీరు సచిన్ టెండూల్కర్‌లాగా దేశీయ క్రికెట్ మ్యాచ్‌లు ఆడాలని సలహా ఇస్తున్నారు ఇంటర్నేషనల్ క్రికెట్ కి వీలు పనికిరారు అన్నట్లు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా కోహ్లీ రిటైర్మెంట్ కి టైం ఆసన్నమైందని పేర్కొంటున్నారు. భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్‌పై ఓడిపోయినప్పటికీ, వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (WTC) పోటీలో 98 పాయింట్లతో మొదటి స్థానంలోనే ఉంది. కానీ, ఇతర జట్లతో పోలిస్తే భారత జట్టు శాతం కొంచెం తగ్గింది. ఇప్పుడు భారత జట్టు శాతం 62.82%. ఆస్ట్రేలియా జట్టు శాతం 62.50%. అంటే, భారత జట్టు ఆస్ట్రేలియా జట్టు కంటే కొంచెం ముందే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: