సర్ఫరాజ్ ఎంట్రీ.. టీమిండియాలో అతని కథ ముగిసినట్లేనా?

praveen
టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ మరోసారి అభిమానులను నిరాశపరిచాడు. బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో రాహుల్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. టీమిండియా జట్టు స్కోరు 408/4 ఉన్నప్పుడు, సర్ఫరాజ్ ఖాన్ 150 పరుగులు చేసి అద్భుతంగా ఆడాడు. అతని తర్వాత బ్యాటింగ్ చేసిన రాహుల్ మాత్రం 12 పరుగులకే అవుట్ అయ్యాడు. సర్ఫరాజ్ అంత బాగా ఆడిన తర్వాత, రాహుల్ కూడా అదే తరహాలో ఆడి జట్టుకు గెలుపు తీసుకువస్తాడని అభిమానులు అనుకున్నారు. కానీ రాహుల్ మాత్రం నిరాశపరిచాడు.
రాహుల్ ఇలా వరుసగా విఫలం అవుతున్నందున, అతనిని జట్టు నుండి తీసివేయాలని అభిమానులు కోరుతున్నారు. ఇక శుభ్‌మన్ గిల్ కూడా జట్టులోకి వస్తున్నాడు కాబట్టి, రాహుల్ స్థానంలో సర్ఫరాజ్‌కు అవకాశం ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు. సర్ఫరాజ్ ఖాన్ ఓ యువ క్రికెటర్. ప్రస్తుతం తన కెరీర్‌లో ఒక కీలకమైన దశలో ఉన్నాడు. తనకు లభించిన అతి కొద్ది అవకాశాలలో అద్భుతంగా ఆడాడు. అయినప్పటికీ, భారత జట్టులో స్థిరంగా ఆడే అవకాశం మాత్రం దక్కడం లేదు.
సర్ఫరాజ్ ఇప్పటివరకు కేవలం 4 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. కానీ ఈ కొద్ది మ్యాచ్‌లలోనే 350 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంటే, అతను ప్రతి ఇన్నింగ్స్‌కు సగటున 58 పరుగులు చేస్తున్నాడు. అంతేకాకుండా ఒక శతకం, మూడు అర్ధశతకాలు కూడా ఉన్నాయి. ఇంత బాగా ఆడుతున్నా, సర్ఫరాజ్‌కు జట్టులో స్థిరమైన స్థానం దక్కకపోవడంపై అతను చాలా బాధపడుతున్నాడు.
న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ తన కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో, మొదటి ఇన్నింగ్స్‌లో డక్‌ ఔట్ అయినప్పటికీ, రెండవ ఇన్నింగ్స్‌లో అద్భుతంగా ఆడాడు. సర్ఫరాజ్ తనదైన ఆట శైలితో న్యూజీలాండ్ బౌలర్లను ఇబ్బంది పెట్టాడు. అతను కొన్ని అద్భుతమైన షాట్లు ఆడాడు. సర్ఫరాజ్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్‌తో కలిసి రెండు ముఖ్యమైన పార్టనర్షిప్స్‌ ఏర్పాటు చేశాడు. ఈ పార్ట్‌నర్‌షిప్స్‌ మ్యాచ్‌లోని పరిస్థితులను భారతదేశం మార్చడానికి సహాయపడ్డాయి. యువ ప్లేయర్ని తీసుకుంటే కేఎల్ రాహుల్ కెరీర్ ముగిసినట్లే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: