రోహిత్‌‌ను అంత మాట అనేసిన బౌలింగ్‌ కోచ్.. ఫ్యాన్స్ కన్ఫ్యూజ్..?

praveen
భారత క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌పై ఆడుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో నాలుగో రోజున గ్రీన్ పార్క్ స్టేడియంలో అద్భుతమైన ఆటను ప్రదర్శించింది. మ్యాచ్‌లో అధిక భాగం వర్షం కారణంగా ఆట ఆగిపోయినప్పటికీ, రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు తమ బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం 34.4 ఓవర్లలో 285 పరుగులు చేసింది. అంటే ఒక ఓవర్‌కు 8.22 పరుగులు అని అర్థం. ఇంత ఎక్కువ పరుగులు అంత తక్కువ సమయంలో చేయడం టెస్ట్ క్రికెట్‌లో చాలా అరుదు. మొత్తం మీద కాన్పూర్‌లో జరిగిన రెండో టెస్టులో 5వ రోజు భారత్ (285/9D & 98/3) బంగ్లాదేశ్ (233 & 146)ను ఓడించింది.
టీమిండియా చాలా దూకుడుగా ఆడడంతో బంగ్లాదేశ్ ప్లేయర్లు నిస్సహాయకంగా కనిపించారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తమ ఇన్నింగ్స్‌ను ముగించింది. ఆపై ఐదో రోజు కూడా చాలా బాగా ఆడి కీలక ఆటగాలను ఈజీగా ఔట్ చేసింది. బంగ్లాదేశ్ జట్టుపై ఘన విజయం సాధించింది. మరోవైపు టీమ్ ఇండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ఇండియన్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మలను బంగ్లాదేశ్‌పై గెలిచినందుకు అభినందించారు. టెస్ట్ మ్యాచ్‌ను టీ20 మ్యాచ్ లాగా ఆడడం చాలా కష్టమైన పని అని, దీనికి చాలా రిస్క్ తీసుకోవాలి అని ఆయన చెప్పారు. రోహిత్ శర్మ చాలా మంచి నాయకుడు అని, ఒక నాయకుడు ముందుండి నడిపించాలి అని, రోహిత్ శర్మ అలాంటి నాయకుడు అని మోర్కెల్ ప్రశంసించారు. రోహిత్ శర్మ ఫస్ట్ నుంచి చాలా దూకుడుగా బ్యాటింగ్ చేశారని ఆయన అన్నారు.
భయం లేకుండా రోహిత్ శర్మ ఆడారంటూ, ఇంతకుముందు భయం ఉన్నట్లు ఆడారంటూ మోర్నీ మోర్కెల్ వ్యాఖ్యలు ఉన్నాయని కొంతమంది ఫ్యాన్స్ ఇందులో నీటి అర్థం తీస్తున్నారు. గౌతమ్ గంభీర్ సారథ్యంలో మాత్రమే ఇది సాధ్యమవుతుందని మిగతా ప్లేయర్లు ఏం చేయలేదన్నట్లు కూడా ఆయన మాట్లాడినట్టు విమర్శిస్తున్నారు. గంభీర్ ఉండకపోతే ఇండియా ఇంత అగ్రిసివ్ గా ఆడి ఉండదని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: