అరుదైన రికార్డ్... సొంత గడ్డపై అపజయమెరుగని టీమిండియా!
పాకిస్థాన్‌ను విజయవంతంగా ఓడించి ఫుల్ జోష్ మీదున్న బంగ్లాదేశ్‌ను 2 టెస్టుల సిరీస్‌లో భారత్ చిత్తుచిత్తు కింద ఓడించింది. బంగ్లాదేశ్‌తో మొదట చెన్నై మైదానంలో జరిగిన మ్యాచ్‌లో భారీ తేడాతో భారత్ గెలిచింది. ఇక వర్షం కారణంగా అనేక సందేహాల మధ్య సాగిన రెండో టెస్టులో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా భారత్ విజయం సాధించింది. దాంతో టెస్టుల్లో ఓటముల కంటే విజయాలే ఎక్కువగా సాధించిన జట్టుగానూ టీమిండియా మారింది. గత 12 ఏళ్లుగా భారత్ ఒక్క సిరీస్‌ను కోల్పోలేదు. బంగ్లాదేశ్ 177 రోజులతో 8వ స్థానంలో ఉండగా.. దాయాది దేశం పాక్ కేవలం 24 రోజులను మాత్రమే తన పేరిట ఈ రికార్డును ఉంచుకుని ఆఖరి ప్లేస్‌కు పరిమితమైంది.
ఇకపోతే, ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని టీమ్‌ఇండియా 2012/13 సీజన్‌లో ఇంగ్లండ్‌తో 1-2 తేడాతో సిరీస్‌ను కోల్పోవడం జరిగింది. ఇక ఆ తరువాత నుంచి తాజాగా బంగ్లాతో సిరీస్ వరకూ 18 టెస్టు సిరీస్‌లను వరుసగా గెలుచుకు రావడం విశేషమనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు స్వదేశంలో జరిగిన ఏ ఒక్క సిరీస్‌ను టీమిండియా వదలలేదు. దాదాపు 4,300కి పై రోజుల నుంచి టీమిండియా ఇక్కడ గెలుస్తూనే ఉంది. సఫారీ జట్టు దాదాపు 1,704 రోజులపాటు స్వదేశంలో సిరీస్ ఓటమే లేకుండా సాగిపోయింది. చివరిసారిగా 2019/2020లో ఆ జట్టు ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను 3-1 తేడాతో కోల్పోయింది.