సిద్దూ: వివాదాలకు కేరాఫ్‌..బీజేపీ, కాంగ్రెస్‌ లలో దమ్మున్న లీడర్ ?

Veldandi Saikiran
* టీమిండియాలో స్టార్ క్రికెటర్ గా సిద్దూకు గుర్తింపు
* వివాదాస్పద క్రికెటర్, రాజకీయ నాయకుడిగా పేరు
* రాజకీయాల్లో రాణిస్తున్న సిద్దు
* బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల్లో పనిచేసిన అనుభవం

టీమిండియా క్రికెటర్లు చాలామంది రాజకీయాల్లో రాణిస్తున్నారు. టీమిండియాలో అప్పట్లో.. సెంచరీల మీద సెంచరీలు... వికెట్ల పైన వికెట్లు తీసిన కొంతమంది స్టార్ క్రికెటర్లు... తమ రిటైర్మెంట్ లైఫ్ ను రాజకీయాల్లో గడుపుతున్నారు. అయితే అలా రాజకీయాల్లోకి వచ్చిన టీమిండియా క్రికెటర్లు కొంతమంది సక్సెస్ అవుతుంటే... మరి కొంతమంది అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. గౌతమ్ గంభీర్, యూసఫ్ పఠాన్, హర్భజన్ సింగ్ లాంటి ప్లేయర్లు... ఇప్పటికే రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు.
 ఇక ఆ లిస్టులో నవజ్యోత్ సింగ్  సిద్దు కూడా ఉన్నారు. నవజ్యోత్ సింగ్ సిద్దు... ఓ వివాదాస్పద ప్లేయర్. టీమిండియా లో ఉన్నప్పుడు... చాలా అగ్రేసీవ్ గా ఉండేవారు.  తన జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టేవాడు కాదు. అంతేకాదు ఒకసారి ఎంపైర్ పై దాడి కూడా చేశాడు సిద్దు. ఆ తర్వాత క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన నవ జ్యోత్ సింగ్ సిద్దు... భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు.

 పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన సిద్దు... అమృత్ సర్ నుంచి బిజెపి నుంచి లోక్సభ ఎంపీగా  గెలిచాడు. అమృత్సర్ నుంచి బిజెపి పార్టీ తరఫున 2004లో విజయం సాధించిన సిద్దు... 2014 వరకు వరుసగా గెలుచుకుంటూ ముందుకు సాగారు.ఆ తర్వాత ఆయనకు... రాజ్యసభ టికెట్ ఇచ్చింది బిజెపి.  2016లో రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. అయితే మోడీ ప్రభుత్వ తీరుకు నిరసనగా 2017లో బిజెపికి రాజీనామా చేశారు సిద్దు.
 అనంతరం కాంగ్రెస్ లో 2017 లోనే చేరారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు అమృత్ సర్ లోని  తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు సిద్దు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పర్యటక శాఖ మంత్రిగా కూడా ఆ పని చేయడం జరిగింది. ఇక 2021లో పిసిసి పంజాబ్ అధ్యక్షులుగా కూడా పనిచేశారు. ఆయన 72 రోజుల పాటే పని చేసి దిగిపోయారు.ఇలా ఆయన రాజకీయ జీవితం... కొనసాగుతోంది. మొన్నటి ఎన్నికల్లో పంజాబ్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో... రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్ గా కనిపించడం లేదు సిద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: