గౌతమ్ గంభీర్: గ్రౌండ్‌ లోనే కాదు... రాజకీయాల్లో మనోడు వీరుడే ?

Veldandi Saikiran
* బీజేపీ పార్టీలో కీలక నేతగా ఎదిగిన గంభీర్
* టీమిండియాలోనూ స్టార్ క్రికెటర్ గా గుర్తింపు
* ప్రస్తుతం టీమిండియా కోచ్గా రాణిస్తున్న గంభీర్


రాజకీయాలు.. ఇది సముద్రమంత పెద్ద సబ్జెక్ట్. రాజకీయాలలోకి చాలామంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. బిజినెస్ చేసేవాళ్లు, ప్రజాసేవ చేయాలని అనుకునేవాళ్లు, సినిమా అలాగే క్రికెటర్లు కూడా రాజకీయాల్లోకి వచ్చి..రాణిస్తున్నారు.  అలాంటి వారిలో టీమిండియా ప్రస్తుత కోసి గౌతమ్ గంభీర్ ఒకరు. ఒకప్పుడు టీమిండియా స్టార్ క్రికెటర్ గా ఎదిగిన గౌతమ్ గంభీర్...ఆ తర్వాత... రాజకీయాల్లో కూడా రాణించి... బిజెపి ఎంపీగా ఎదిగారు.
వాస్తవంగా... గౌతమ్ గంభీర్ ఢిల్లీ ప్రాంతానికి చెందినవాడు. టీమిండియాలో చాలా అగ్రెసివ్ ప్లేయర్.ఎవరైనా ఒక మాట అంటే అస్సలు పడేవాడు కాదు. ఎంతటి వాడైనా... వెంటనే రియాక్ట్ అయి అతనికి బుద్ధి చెబుతాడు గౌతమ్ గంభీర్. తన జోలికి వస్తే ఎవరిని వదలడు. అందుకే విరాట్ కోహ్లీ వర్సెస్ గౌతమ్ గంభీర్ మధ్య అప్పట్లో విభేదాలు... చోటుచేసుకున్నాయి.
అయితే అలాంటి గౌతమ్ గంభీర్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత బిజెపి పార్టీలో చేరిపోయారు. ఈ ధర్నాలోనే 2019లో బిజెపి పార్టీ తరఫున ఈస్ట్ ఢిల్లీ నుంచి.. పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేశారు. దీంతో అఖండ విజయం సాధించారు గంభీర్. 2024 వరకు ఎంపీగా పనిచేసిన గౌతమ్ గంభీర్.. తన నియోజకవర్గానికి ఐదు సంవత్సరాల పాటు మంచి సేవనే అందించారు. కానీ  2024 పార్లమెంటు ఎన్నికల కంటే ముందు... బిజెపి పార్టీతో పాటు రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పారు.
మళ్లీ ఐపీఎల్ లో యాక్టివ్ అయ్యారు గంభీర్. 2024 ఐపీఎల్ టోర్నమెంటులో కోల్కతా నైట్ రైడర్స్ మెంటర్గా... పనిచేసి ఆ జట్టుకు కప్ తీసుకువచ్చారు. ఆ తర్వాత.. కేకేఆర్ కు గుడ్ బై చెప్పి ఇప్పుడు... టీమిండియా హెడ్ కోచ్ గా నియామకమయ్యారు గంభీర్. గంభీర్ సారధ్యంలో టీమిండియా వరుస విజయాలతో దూసుకు వెళ్తోంది. గతంలో విరాట్ కోహ్లీ తో గొడవ పెట్టుకున్న గంభీర్.. ఇప్పుడు అతనితో చాలా సాన్నిహిత్యంగా ఉంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: