బ్రేక్ ఫాస్ట్ లో ఇవి ఉంటే.. రోగాలు కూడా మీ దగ్గర రావాలంటే భయపడతాయి?

praveen
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి ఎంత బిజీ అయిపోయాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కనీసం ఆరోగ్యం గురించి పట్టించుకునే సమయం కూడా ఎవరి దగ్గర లేకుండా పోయింది. త్వరగా ఆఫీసుకు వెళ్లాలి.. త్వరగా పనులు పూర్తి చేసుకోవాలి.. త్వరగా ఇంటికి రావాలి. త్వరగా నిద్రపోవాలి.. ఇలా అన్ని త్వర త్వరగా చేయాలి అని అనుకుంటూ చివరికి.. సరైన ఆహారాన్ని తీసుకోవాలి అనే విషయాన్ని మర్చిపోతున్నాడు. కడుపు నిండడానికి ఏదో ఒకటి తినడం తప్ప అందులో పోషకాలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని కూడా పట్టించుకోవట్లేదు.

 ఇక నేటి ఆధునికన జీవన శైలిలో పిజ్జాలు బర్గర్లు అంటూ హోటల్ ఫుడ్స్ కి బాగా అలవాటు పడిపోయిన మనిషి.. అసలు పోషకాలు ఉన్న ఆహారం గురించి పట్టించుకోవడం ఎప్పుడో మరిచిపోయాడు. చివరికి ఇలాంటి ఆహారపు అలవాట్ల కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటూ సంపాదించిన మొత్తాన్ని కూడా ఆస్పత్రుల్లో ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టుకుంటూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక మనిషి ఆరోగ్యాన్ని బాగా ప్రభావితం చేసే విషయాలను ఉదయం చేసే బ్రేక్ ఫాస్ట్ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే.

 ఒక మనిషి రోజంతా చురుగ్గా ఉండాలి అంటే ఉదయం చేసే బ్రేక్ ఫాస్ట్ ఎంతో ప్రభావితం చేస్తూ ఉంటుంది. కానీ నేటి రోజుల్లో చాలామంది బ్రేక్ ఫాస్ట్ లో ఏదో ఒకటి తిని కడుపు నింపుకుంటున్నారు. అలా కాకుండా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఇక రోగాలు కూడా మీ దగ్గరికి రావడానికి భయపడతాయి అంటూ నిపుణులు చెబుతున్నారు. బ్రేక్ ఫాస్ట్ లో నెయ్యి కూరగాయలు నట్స్ డ్రై ఫ్రూట్స్ లాంటివి ఉంటే శక్తితో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. చాలామంది ఇడ్లీ దోశ పూరి లాంటివి ఆరగిస్తూ ఉంటారు. కానీ వీటిల్లో పైన చెప్పిన వేవి ఉండవు. ఉప్మాలో ఇవన్నీ వేసుకోవచ్చు. వీటితోపాటు గుడ్డు గ్లాసు పాలు తాగితే రోగ నిరోధక శక్తి పెరిగి రోజంతా చురుగ్గా ఉండడమే కాదు రోగాలు కూడా దరిచేరవు అంటూ నిపుణులు సూచిస్తూ ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: