ధోని అలాంటోడా.. ఎవరికి తెలియని విషయం చెప్పిన ఆకాష్ చోప్రా?

frame ధోని అలాంటోడా.. ఎవరికి తెలియని విషయం చెప్పిన ఆకాష్ చోప్రా?

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఇండియన్ క్రికెట్లో కోట్లాదిమంది అభిమానులకు ఆయన ఒక దేవుడు. ఏకంగా టీమ్ ఇండియాకు రెండుసార్లు వరల్డ్ కప్ లు అందించి ఇక ఇండియన్ క్రికెట్ చరిత్రలో బెస్ట్ కెప్టెన్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్ లో బెస్ట్ వికెట్ కీపర్ గా బెస్ట్ ఫినిషిర్ గా కూడా మహేంద్ర సింగ్ ధోనీకి ప్రత్యేకమైన గుర్తింపు. అయితే అందరిలా కాకుండా ధోని ప్రత్యేకమైన యాటిట్యూడ్ తో ఉంటాడు అన్న విషయం తెలిసిందే.

 సాధారణంగా మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతున్న సమయంలో ఒత్తిడికి లోనై ఎంతో మంది క్రికెటర్లు తమ సహనాన్ని కోల్పోతూ ఉంటారు. కానీ మహేంద్రసింగ్ ధోని మాత్రం చిరునవ్వుతోనే అన్ని పరిస్థితులను తన వైపుకు తిప్పుకుంటూ ఉంటాడు. వికెట్ల వెనకాల ఉండి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తూ ఉంటాడు. అందుకే అభిమానులు అందరూ కూడా ధోని మిస్టర్ కూల్ కెప్టెన్ అని అంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక జట్టులోనే ఆటగాళ్లు అందరిని కూడా సమన్వయం చేస్తూ కమ్యూనికేషన్ మైంటైన్ చేయడంలో మహేంద్రసింగ్ ధోని దిట్ట అనడంలో సందేహం లేదు.

 ఇలా మహేంద్ర సింగ్ ధోని జట్టులోని ఆటగాల్లను కమ్యూనికేట్ చేయడంలో ఎంతో దూకుడుగానే వ్యవహరిస్తూ ఉంటాడు. అలాంటి ధోని గురించి అభిమానులకు సైతం తెలియని ఒక విషయాన్ని చెప్పుకొచ్చాడు మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా. ఎంఎస్ ధోనీ టీమ్ ఇండియాలోకి రాకముందు చాలా సిగ్గుపడుతూ ఉండేవాడు అంటూ ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. ఒకసారి ఇద్దరం నెల రోజులు ఒకే హోటల్ గదిలో ఉన్నాము. అతనేమో మాంసాహారి. నేను శాకాహారిని. ఏం కావాలని అడిగితే మీ ఇష్టం అనేవాడు. ఎప్పుడు పడుకుంటావు అని అడిగితే మీకు ఇష్టమైనప్పుడు లైట్స్ ఆఫ్ చేసుకోండి అనేవాడు. స్వేచ్ఛగా ఉంటాడు. కానీ నిర్లక్ష్యం అహం ఉండదు. జీవితం ఎలా ఉన్నా ఆస్వాదిస్తూ సంతోషంగా ఉండే మనిషి ధోని అంటూ ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: