కోచ్‌గా సెలెక్టైన వెంటనే అతడికే ఫోన్ చేసిన మోర్నే మోర్కెల్..?

praveen

సౌతాఫ్రికా క్రికెట్ టీమ్‌లో కీలక ప్లేయర్‌గా చాలా పేరు తెచ్చుకున్న మోర్నే మోర్కెల్, ఇప్పుడు టీమిండియాకు బౌలింగ్ కోచ్‌గా నియమితులయ్యాడు. ఇది చాలా మంచి పొజిషన్ అని చెప్పుకోవచ్చు. దీన్ని సాధించిన తర్వాత అతని ఎంతో సంతోషించారు. అంతేకాదు ఎవరినీ కలవకుండా, చివరికి తన భార్యను కూడా కలవకుండా ఒకరిని కలిశారు. ఆయన మరెవరో కాదు అతడి తండ్రి. ఈ కొత్త పదవి గురించి తన తండ్రితో ఎంతో ఆనందంగా, గర్వంగా ఉన్నట్లు చెప్పాడట. ఈ పెద్ద బాధ్యత తనకు ఎంతో ప్రత్యేకమని తెలిపినట్లు పేర్కొన్నాడు. సెప్టెంబర్ 1 నుంచి తన కొత్త పదవిని చేపట్టారు. ఇంతకు ముందు ఆటగాడిగా 12 ఏళ్లు దక్షిణాఫ్రికా జట్టుకు ఆడి, మూడు రకాల క్రికెట్‌లో కలిపి 544 వికెట్లు పడవేశారు.
"టెస్ట్ మ్యాచ్‌ల కోసం టీమిండియాకు బౌలింగ్ కోచ్‌గా నేను నియమితులయ్యాను. ఈ విషయం తెలిసిన వెంటనే నేను మొదట నా తండ్రికి ఫోన్ చేశాను. నా భార్యకు కాదు. ఎందుకంటే, నా తండ్రి క్రికెట్ ఫ్యాన్. ఈ పదవి నాకు చాలా ప్రత్యేకమని చెప్పాను. నాకు ఈ పదవి దక్కడం చాలా ఆనందంగా ఉంది. నా కుటుంబంతో కలిసి ఈ ఆనందాన్ని పంచుకున్నాను." అని మోర్నే మోర్కెల్ వెల్లడించాడు.
మోర్కెల్ తన కొత్త పొజిషన్‌లో కొనసాగుతూనే తన సహచరులతో మంచి సంబంధం ఏర్పరుచుకోవాలని కోరుకుంటున్నాడు. "నేను టీమిండియాలో కొత్తగా చేరినందున, జట్టులోని అందరితో స్నేహం చేయాలని ఆశిస్తున్నా. ఇంతకు ముందు చాలా మంది భారతీయ ఆటగాళ్లతో ఆడాను. ఇప్పుడు వారితో కలిసి ప్రాక్టీస్ చేయడం, స్నేహం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది." అని అన్నాడు.
మోర్కెల్ ఇప్పుడు భారత క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా ఉన్నారు. ఆయనకు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టులో గౌతమ్ గంభీర్‌తో కలిసి ఆడారు. ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ (LSG) టీమ్‌కు కోచింగ్ చేశారు. అంటే వీళ్ళిద్దరూ చాలా కాలంగా కలిసి పని చేస్తున్నారు. ఆ పరిచయంతోనే తన దగ్గరకు మోర్కెల్ ను తీసుకొచ్చాడు. ఈ ప్లేయర్ గతంలో పాకిస్తాన్ జట్టుకు కూడా కోచ్‌గా పనిచేశారు. ఇప్పుడు భారత జట్టుకు కోచ్‌గా వచ్చారు. అంటే అతను చాలా దేశాల క్రికెట్ జట్లకు కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: