మొన్నే క్రికెట్ లోకి వచ్చి.. అంతలోనే ధోని రికార్డును సమం చేసేసాడుగా?
అయితే భారత జట్టుకు రెండుసార్లు వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ గా మాత్రమే కాకుండా వరల్డ్ క్రికెట్లో బెస్ట్ వికెట్ కీపర్ గా బెస్ట్ ఫినిషర్ గా కూడా ధోని ప్రస్తానాన్ని కొనసాగించాడు. అయితే ఈ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్నాడు కాబట్టి.. ధోని 2019లో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కి రిటైర్మెంట్ ప్రకటించిన.. ఇంకా ఆయన క్రేజ్ ఇసుమంతైన తగ్గలేదు. అయితే ధోని వికెట్ కీపర్ గా ఇప్పటివరకు ఎన్నో అరుదైన రికార్డులను నమోదు చేశాడు ఇక ధోని సాధించిన రికార్డులను బ్రేక్ చేయడానికి మిగతా క్రికెటర్లు చాలా కష్టపడి పోతూ ఉంటారు.
అయితే మొన్నే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టిన ఒక యువ క్రికెటర్ ఇటీవల లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని రికార్డును బ్రేక్ చేశాడు. ప్రస్తుతం దిలీప్ ట్రోఫీలో భాగంగా టీమిండియా తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లందరూ కూడా వరుసగా మ్యాచ్లు ఆడుతూ బిజీబిజీగా ఉన్నారు అన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే టీమిండియా యంగ్ వికెట్ కీపర్ ద్రువ్ జూరెల్ దిగ్గజం ధోని రికార్డును సమం చేశాడు. దులీప్ ట్రోఫీలో ఇండియా బి తో జరుగుతున్న మ్యాచ్లో ఓకే ఇన్నింగ్స్ లో జూరెల్ ఏడు క్యాచ్ లు అందుకున్నాడు. కాగా ఆ తర్వాత స్థానాల్లో బెంజమిన్, విశ్వనాథ్ ఆరేసి క్యాచ్ లతో ఉన్నారు.