KKR మెంటార్ గా గంభీర్ స్థానంలో.. ఎవరు రాబోతున్నారో తెలుసా?

frame KKR మెంటార్ గా గంభీర్ స్థానంలో.. ఎవరు రాబోతున్నారో తెలుసా?

praveen
బిసిసిఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా వరల్డ్ క్రికెట్లోనే రిచెస్ట్ క్రికెట్ లీగ్ గా కొనసాగుతోంది ఐపీఎల్. ఈ క్రమంలోనే  ఐపిఎల్ లో ఆడేందుకు దేశ విదేశాల నుంచి ఆటగాళ్లు తరలివస్తూ ఉంటారు. ఐపీఎల్ లో పాల్గొంటే భారీగా ఆదాయంతో పాటు ఇక ఎంతో మంది స్టార్ట్ ప్లేయర్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకునే అవకాశం కూడా వస్తుంది. దీంతో మంచి అనుభవాన్ని కూడా సాధించవచ్చు. అందుకే ఎంతో మంది స్టార్ ప్లేయర్స్  ఐపీఎల్ లో పాల్గొంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇప్పుడు వరకు ఐపీఎల్ హిస్టరీలో కొన్ని టీమ్స్ ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్నాయ్. అలాంటి వాటిలో ముంబై ఇండియన్స్,చెన్నై సూపర్ కింగ్స్ ఈ రెండు టీమ్స్ అందరికంటే ఎక్కువసార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకొని టాప్ లో ఉన్నాయి. ఈ రెండు టీమ్స్ తర్వాత ఇక ఎక్కువ టైటిల్స్ గెలుచుకున్న జట్లలో అటు కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఒకటి ఉంది అన్న విషయం తెలిసిందే . ఈ ఏడాది  జరిగిన ఐపీఎల్ సీజన్ లోను ఏకంగా ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిచింది. గౌతమ్ గంభీర్ మెంటార్గా ఉండగా అతని సలహాలతో అద్భుతంగా రాణించిన కోల్కతా జట్టు అదరగొట్టేసింది అని చెప్పాలి.

 కానీ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో కోల్కత్తా జట్టు మెంటార్గా వ్యవహరించిన గౌతమ్ గంభిర్  ఇక ఇప్పుడు టీమిండియా హెడ్ కోచ్గా వ్యవహరించెందుకు ఛాన్స్ రావడంతో.. చివరికి మెంటర్ బాధ్యతలకు స్వస్తి పలికేసాడు. దీంతో గంభీరు స్థానంలో ఎవరు రాబోతున్నారు అనే విషయంపై చర్చ జరుగుతూ ఉంది. అయితే కోల్కతా నైట్ రైడర్స్ మెంటర్ గా శ్రీలంక మాజీ క్రికెటర్ సంఘకర నియామకం కానున్నట్లు క్రీడా వర్గాల నుంచి సమాచారం. ప్రస్తుతం ఆయన రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ గా ఉన్నారు. అయితే ఆ జట్టు హెడ్ కోచ్గా రాహుల్ ద్రావిడ్ ను ఆ జట్టు యాజమాన్యం తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఇక సంగాకరా  అటు కోల్కతా జట్టు మెంటార్గా బాధ్యతలు చేపట్టబోతున్నట్లు తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: