హార్దిక్ దగ్గరికి వచ్చేసిన కొడుకు అగస్త్య.. వీడియో వైరల్?

frame హార్దిక్ దగ్గరికి వచ్చేసిన కొడుకు అగస్త్య.. వీడియో వైరల్?

praveen
టీమ్ ఇండియాలో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా గత కొంతకాల నుంచి వార్తల్లో నిలుస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టి విమర్శలు ఎదుర్కొని వార్తల్లో నిలిచాడు. ఇక ఆ తర్వాత టీమ్ ఇండియాలోకి వచ్చి వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర వహించి ప్రశంసలు అందుకుని వార్తల్లో నిలిచాడు. చివరికి ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య నటాషాతో హార్దిక విడాకులకు రెడీ అయ్యాడు అంటూ పర్సనల్ విషయాలతోనే వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు.

 అయితే ఎన్నో రోజులపాటు హార్దిక్ పాండ్యా, నటాషా విడాకులు తీసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు తెరమీదకి రాగా.. ఇది నిజమా అబద్దమా అనే విషయంపై అభిమానులు అందరూ కూడా కన్ఫ్యూజన్లోనే ఉండిపోయారు. కానీ మొన్నటికి మొన్న తాము నిజంగానే విడాకులు తీసుకొని వేరుపడుతున్నాము అంటూ హార్దిక్ పాండ్యా దంపతులు ప్రకటించడంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అయితే విడాకుల తర్వాత హార్దిక్ భార్య నటాషా తన కొడుకు అగస్త్యని తీసుకొని సెర్బియా వెళ్ళిపోయింది. ఇక అక్కడ కొడుకుతో దిగిన ఫోటోలను తరచూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంది. అయితే నటాషా తండ్రి హార్దిక్ కి కొడుకును దూరం చేసింది అంటూ కొంతమంది సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా చేశారు.

 అయితే హార్దిక్ పాండ్యా కొడుకు అగస్త్య గురించి ఇప్పుడు ఒక ఇంట్రెస్ట్ న్యూస్ వైరల్ గా మారిపోయింది. టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా కుమారుడు అగస్త్య ను నటాషా సెర్బియా నుంచి ఇండియాకు పంపారు. ప్రస్తుతం ఆ చిన్నారిని హార్దిక్ సోదరుడు కృణాల్ పాండ్యా భార్య పాంకూరి శర్మ సంరక్షిస్తున్నారు. తన కుమారుడు కబీర్ తో కలిసి అగస్త్య కథలు వింటున్న ఫోటోలని పాన్కూరి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ గా మారిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోవడంతో.. ఇది చూసి ఫ్రాన్స్ మురిసిపోతున్నారు. హమ్మయ్య తండ్రి వద్దకు కొడుకు చేరాడు. ఇక హార్దిక్ పాండ్యా ఫుల్ హ్యాపీ అంటూ కామెంట్ చేస్తున్నారు.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: