కోహ్లీ, ధోని కాదు.. ఈ భారత క్రికెటరే అత్యంత ధనవంతుడు తెలుసా?

praveen
ఇండియాలో క్రికెట్ కి ఎంత విపరీతమైన క్రేజీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో రకాల క్రీడలు ఉన్నప్పటికీ క్రికెట్ ని అమితంగా అభిమానిస్తూ ఉంటారు. క్రికెట్ మ్యాచ్ వస్తుంది అంటే చాలు అన్ని పనులను పక్కన పెట్టేసి ఇక టీవీలకు అతుక్కుపోతూ ఉంటారు. స్టార్ క్రికెటర్లని ఏకంగా దేవుళ్ళ లాగా ఆరాధిస్తూ ఉంటారు ప్రేక్షకులు. క్రికెట్ కి ఈ రేంజ్ లో క్రేజ్ ఉంది కాబట్టి.. ఈ మధ్యకాలంలో ఎంతోమంది కుర్రాళ్ళు క్రికెట్ నే ప్యాషన్ గా మార్చుకొని ముందడుగు వేస్తూ ఉన్నారు.

 అయితే ఇలా క్రికెటర్ గా ముందుకు సాగుతున్న ఆటగాడు.. దేశవాళీ క్రికెట్లో కొనసాగుతున్న సమయంలో కొంత మేరకు ఆర్థిక సమస్యలు ఎదుర్కున్నప్పటికీ  అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చిన తర్వాత మాత్రం లగ్జరీ లైఫ్ ను గడుపుతూ ఉంటారు. ఎందుకంటే కోట్లల్లో సంపాదిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇండియన్ క్రికెటర్లలో ఇలా సంపన్నుడైన క్రికెటర్ ఎవరు అంటే ముందుగా విరాట్ కోహ్లీ పేరు గుర్తుకు వస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ద్వారా వాణిజ్య ప్రకటనల ద్వారా క్రికెట్ ఆడటం ద్వారా కూడా కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటాడు విరాట్ కోహ్లీ.

 ఇక తర్వాత ధోని రోహిత్ సచిన్ లాంటివాళ్ళు భారీగా సంపాదిస్తూ ఉంటారు అని చెప్పాలి. కానీ కోహ్లీ, ధోని కాదు ఏకంగా భారత క్రికెటర్లు ఎవరికి సాధ్యం కాని రీతిలో ఓ ప్లేయర్ అందరికంటే ధనవంతుడిగా కొనసాగుతూ ఉన్నాడు. ఎంతలా అంటే ఏకంగా 70 వేల కోట్ల రూపాయలకు అతను అధిపతి. ఇలా విరాట్ కోహ్లీ, ధోని, సచిన్, రోహిత్ లాంటి స్టార్స్ కంటే సంపన్నుడైన భారత క్రికెటర్ ఎవరో కాదు ఆర్య మాన్ బిర్లా. ఆయన నికర ఆస్తి విలువ ఏకంగా 70 వేల కోట్ల రూపాయలు. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం కొడుకే ఈ ఆర్య మాన్ బిర్లా. 2018లో అతన్ని 30 లక్షలకు ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేయగా.. 2019లోనే అతను ఆటకు రిటైర్మెంట్ ప్రకటించి బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: