బీసీసీఐ కుట్రలు... బ్యాంకు ఉద్యోగిగా మిగిలిపోయిన టీమిండియా ప్లేయర్!
మార్చి 24, 1999లో పెప్సీ కప్ ట్రై-సిరీస్ లో భాగంగా ఇండియా - పాకిస్తాన్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు జ్ఞానేంద్ర కుమార్. స్పిన్ ఆల్ రౌండర్ అయిన జ్ఞానేంద్ర టీమిండియాలో సెటిల్ అవుతాడని అందరూ ఊహించారు. ఆ సమయంలో భారత జట్టులో ఆల్ రౌండర్లకు కొరత ఉండేది. దీంతో ఆ స్థానాన్ని జ్ఞానేంద్ర కుమార్ భర్తీ చేస్తాడని అందరూ అనుకుంటే.... రెండు వన్డేలకే అతడి క్రికెట్ కెరీర్ ముగిసింది.
అదే పాకిస్తాన్ తో మొహాలీలో వారం తర్వాత ఆడిన రెండో మ్యాచ్ అతడికి లాస్ట్ మ్యాచ్ గా నిలిచింది. ఆ తర్వాత భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా జ్ఞానేంద్ర కుమార్ కు కుదరలేదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 117 మ్యాచుల్లో కలిపి 5348 పరుగులు చేసిన జ్ఞానేంద్ర 165 వికెట్లు పడగొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్లో 82 మ్యాచుల్లో 1781 పరుగులు చేసి....89 వికెట్లు తీశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో మరిన్ని అవకాశాలు ఇస్తే జ్ఞానేంద్ర తప్పక రాణించేవాడేమో కానీ సెలెక్టర్లు మాత్రం అతడిని ఎంపిక చేయలేదు.
డొమెస్టిక్ క్రికెట్ లో ఎంత రాణించినా.... ఆరేళ్లపాటు తీవ్రంగా ప్రయత్నాలు చేసిన అతడిని తిరిగి నేషనల్ టీం లోకి తీసుకోలేదు. దీంతో జ్ఞానేంద్ర క్రికెట్ కెరీర్ పై ఆశలు వదులుకున్నాడు. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పిఆర్ ఏజెంట్ గా జ్ఞానేంద్ర పనిచేస్తున్నాడు. అప్పటి బీసీసీఐ సెక్రటరీ జయంత్ లేలే నుంచి జ్ఞానేంద్రకు సపోర్ట్ లేకపోవడంతో తాను ఇలా ఉండిపోయానని....లేకపోతే తన కెరియర్ వేరేలా ఉండేదని ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జ్ఞానేంద్రకుమార్ వాపోయాడు.