రిషబ్ పంత్ గొప్ప మనసు.. కాలేజీ ఫీజు కట్టేసాడు.
అందుకే క్రికెటర్లకు సంబంధించి ఏ విషయం సోషల్ మీడియాలోకి వచ్చినా కూడా అది తెగ వైరల్ గా మారిపోతూ ఉంటుంది. అయితే క్రికెటర్ల ప్రొఫెషనల్ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకునేందుకు అభిమానులు తెగ ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రొఫెషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టిన తర్వాత చాలామంది క్రికెటర్లు కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటారు. అయితే ఇలా కోట్ల రూపాయలు సంపాదించి ఊరుకోకుండా కొంతమంది సేవ కార్యక్రమాలు చేసి మంచి మనసును కూడా చాటుకుంటూ ఉంటారూ. ఇక ఇప్పుడు భారత జట్టులో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న రిషబ్ పంత్ కూడా ఇలాంటి ఒక గొప్ప పని చేసి అభిమానులను కాలర్ ఎగరేసుకొనేల చేశాడు.
ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతున్న ఒక ఇంజనీరింగ్ విద్యార్థికి ఆర్థిక సహాయం చేశాడు టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్. ఏకంగా 90 వేల రూపాయల ఫీజు చెల్లించి.. ఇక అతనికి కాలేజీ ఫీజు కట్టేసాడు. సదరు పేద విద్యార్థికి అండగా నిలిచాడు పంత్. ఇక సోషల్ మీడియాలో సహాయం చేయాలని ఆ విద్యార్థి రిషబ్ పంతుని కోరడంతో.. ఇక ఈ స్టార్ ప్లేయర్స్ స్పందించాడు అన్నది తెలుస్తుంది. కాగా దాదాపు ఏడాదిన్నర తర్వాత క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన పంత్ వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ లో కూడా ఉన్నాడు. అంతేకాదు ఇక టెస్ట్ ఫార్మాట్లో భారత జట్టు వైస్ కెప్టెన్ గా కూడా ఎంపిక అయ్యే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది.