మరో గొప్ప నిర్ణయం తీసుకున్న బీసీసీఐ.. దేశవాళీ క్రికెటర్లకు ఇది నిజంగా వరమే?

praveen
భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రస్తుతం వరల్డ్ క్రికెట్లోనే రిచెస్ట్ క్రికెట్ బోర్డుగా కొనసాగుతోంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇండియాలో క్రికెట్ కి ఉన్న విపరీతమైన క్రేజ్ దృశ్య ఇక మిగతా క్రీడలను పెద్దగా పట్టించుకోని క్రీడాభిమానులు.. క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు మాత్రం టీవీలకు అతుక్కుపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఎవరైనా ఆటగాడు ప్రొఫెషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టి జాతీయ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించారు అంటే చాలు వారి లైఫ్ స్టైల్ ఒక్కసారిగా మారిపోతూ ఉంటుంది.

 కానీ దేశవాళి క్రికెట్లో ఆటగాళ్లకు అంతంత మాత్రమే వేతనాలు ఉంటాయని.. పెద్దగా ప్రైజ్ మనీలు కూడా ఉండవు అని క్రికెట్ విశ్లేషకులు చెబుతూ ఉంటారు. అందుకే దేశవాళి క్రికెటర్లు ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో ఆటగాళ్ల వేతనం విషయంలో ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఆటగాళ్లు అందరికీ కూడా వరాల ఇచ్చేస్తుంది బీసీసీఐ. ఇక ఇప్పుడు దేశవాళి క్రికెటర్ల విషయంలో కూడా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇది నిజంగా దేశవాలి క్రికెట్ ఆడుతున్న ప్లేయర్లందరికీ కూడా ఒక వరం లాంటిది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

 దేశంలో జరిగే అన్ని జూనియర్ క్రికెట్ టోర్నమెంట్లు మహిళల టోర్నమెంట్లలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులకి కూడా ప్రైజ్ మనీ ఇవ్వబోతున్నట్లు బిసిసిఐ సెక్రటరీగా కొనసాగుతున్న జై షా ప్రకటించారు. అలాగే సీనియర్ మెన్స్ కి విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లోను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులకి నగదు బహుమతులను ఇస్తాము అంటూ ప్రకటించారు. దేశవాలి క్రికెట్ లో రాణిస్తున్న ఎంతోమంది ప్లేయర్ల ప్రతిభను గుర్తించేందుకే ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాము అంటూ చెప్పుకొచ్చారు. అయితే ప్రైజ్ మనీ గా ఎంత ఇవ్వబోతున్నారు అన్న విషయం మాత్రం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: