క్రికెట్ మ్యాచ్‌లో మరో తప్పిదం..ఓవర్‌కి 5 బంతులేనా?

praveen


క్రికెట్‌లో రికార్డుల మోత మోగుతూనే ఉంటుంది. క్షణాల్లోనే పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. ఆటగాళ్ల ప్రదర్శన అన్నీ మార్చేస్తూ ఉంటుంది. అలాంటి క్రికెట్ ప్రపంచంలో ఎన్నో వింతలు కూడా చూడొచ్చు. నమ్మలేని కొన్ని ప్రదర్శనలు కూడా ఉంటాయి. అటువంటి విషయం గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. సాధారణంగా క్రికెట్ మ్యాచ్‌లో ఒక ఓవర్‌కు 6 బంతులు ఉంటాయని అందరికీ తెలుసు. క్రికెట్‌లో అదొక నియమం. అయితే బౌలర్ కేవలం 5 బంతులు వేసి ఓవర్‌ను ముంగిచాడని చాలా మందికి తెలీదు. అంపైర్ కూడా ఆ బౌలర్‌ను ఏమీ అనలేకపోయాడు. ఈ విచిత్ర సంఘటన ఎక్కడెక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో చూస్తే కేవలం 5 బంతుల్లోనే ఒక ఓవర్‌ను ముగించి ముగ్గురు బౌలర్లు ఉన్నారు.
శ్రీలంక మాజీ ఫాస్ట్ బౌలర్ అయిన లసిత్ మలింగ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌లో 5 బంతులు వేసి ఓవర్‌ను ముగించాడు. భారత్-శ్రీలంక మధ్య 2012లో వన్డే మ్యాచ్‌ జరుగుతుండగా అందులో మలింగ తన ఓవర్‌ను 5 బంతులే వేశాడు. ఆ తర్వాత ఆ ఒక్క బాల్ టీమిండియాను దెబ్బకొట్టింది. ఆ మ్యాచ్‌లో భారత్‌ ఒక్క బంతి లేకపోవడం వల్ల ఓడిపోయిన పరిస్థితి వచ్చింది.
ఇకపోతే బంగ్లాదేశ్ జట్టు లెఫ్టార్మ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ అయిన ముస్తాఫిజుర్ రెహ్మాన్ కూడా ఒక ఓవర్‌లో 5 బంతులే వేశాడు. 2021వ సంవత్సరంలో బంగ్లాదేశ్- వెస్టిండీస్ మ్యాచ్ జరుగుతుండగా ముస్తాఫిజుర్ తన ఓవర్‌లో 6కి బదులు 5 బంతులు వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ ఓవర్లో బాల్స్‌ను లెక్కపెట్టడంలో ఫీల్డ్ అంపైర్ కూడా తప్పు చేశాడని తెలిసింది. ఫీల్డ్ అంపైర్ పొరపాటు వల్ల 5 బాల్స్‌తో ఒక ఓవర్ ముగిసింది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఫాస్ట్ బౌలర్ అయిన నవీన్ ఉల్ హక్ కూడా 5 బంతులే వేసి ఓవర్ ముగించాడు. టీ20 వరల్డ్ కప్ 2022లో ఆఫ్ఘనిస్తాన్ - ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగింది. అందులో నవీన్ 5 బంతులే వేశాడు. ఫీల్డ్ అంపైర్ బంతిని లెక్కించడంలో పొరపాటు చేయడం వల్ల అలా జరిగిందని రుజువైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: