ఐపీఎల్: క్రికెటర్లను ముంచడానికే ఆ రూల్ తెచ్చారు?
మరోవైపు ఈ వేలం ఎలా జరగాలనే విషయంపై జట్ల మధ్య చాలా అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కొన్ని జట్లు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగే పెద్ద వేలాన్ని లేకుండా చేయాలని అనుకుంటున్నాయి. మరికొన్ని జట్లు ఈ పెద్ద వేలాన్ని ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పెట్టాలని కోరుతున్నాయి. ఇంకా, కొన్ని జట్లు తమ జట్టులో ఇప్పటికే ఉన్న కొంతమంది ఆటగాళ్లను వేలం లేకుండా తమ జట్టులోనే ఉంచుకోవడానికి అనుమతి పెంచాలని కోరుతున్నాయి. కానీ, మరికొన్ని జట్లు ఇప్పటి ఉన్న నిబంధనలే సరైనవి అంటున్నాయి.
ఈ విషయాలన్నీ చర్చించడానికి ఐపీఎల్ నిర్వాహకులు అన్ని జట్ల యజమానులతో సమావేశం పెట్టుకున్నారు. ఈ సమావేశంలో "రైట్ టు మ్యాచ్" ప్రధాన చర్చినీయాంశంగా మారింది. ఈ రూల్ ఏంటంటే, ఒక టీమ్ తమ ప్రీవియస్ సీజన్ ప్లేయర్‌ను వేరే వాళ్లు కొనుక్కోకుండా తమకే అంటిపెట్టుకోవచ్చు. ఆ ఆటగాడి కోసం ఇతర జట్టు ఎంత ఎక్కువ అమౌంట్ బిడ్ చేసినా ప్లేయర్ ఆ ఇతర జట్టుకు వెళ్ళలేడు. ఈ హక్కును తిరిగి తెచ్చే విషయం కూడా చర్చించబోతున్నారు.
రవిచంద్రన్ అశ్విన్ ఈ హక్కు గురించి చాలా బాధపడుతున్నాడు. అతని అభిప్రాయం ప్రకారం, ఈ నియమం ఆటగాడికి మాత్రమే కాకుండా, ఆ ఆటగాడిని వేరే జట్టులోకి తీసుకోవాలనుకునే జట్టుకు కూడా అన్యాయం చేస్తుంది. ఉదాహరణకు, ఒక ఆటగాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్నాడు అనుకోండి. ఆ ఆటగాడిని వేరే జట్టు 5-6 కోట్ల రూపాయలకు కొనాలనుకుంటుంది. కానీ, సన్‌రైజర్స్ జట్టు ఆ ఆటగాడిని తమ జట్టులోనే ఉంచుకోవాలనుకుంటే, వేరే జట్టు ఎంత ధర ఆఫర్ చేసినా ఆ ఆటగాడు సన్‌రైజర్స్‌లోనే ఉండాలి. ఇది ఆ ఆటగాడికి, ఆటగాడిని కొనాలనుకునే జట్టుకు కూడా అన్యాయం చేసినట్లు అవుతుందని అశ్విన్ అంటున్నాడు.