దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణం.. ఏకంగా 200 ఎకరాలలో ఎక్కడంటే..?

Divya
క్రికెట్ అంటే తెలియనివారంటు ఎవరు ఉండరు.. చాలా చోట్ల క్రికెట్ స్టేడియాలు ఉన్న సంగతి కూడా తెలిసింది.. అయితే ఇప్పుడు తాజాగా దేశంలోని మరొక అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని రూపొందించబోతున్నారట.. అది కూడా కోయంబత్తూరులో నిర్మించబోతున్నట్లు ఇటీవలే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ విషయాన్ని ప్రకటించింది. ఏడాది ఏప్రిల్ లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా ఈ విషయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తెలియజేశారు. చెన్నైలోనే MA చిదంబరం స్టేడియం తర్వాత మళ్లీ తమిళనాడులో ఇదే రెండవ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అవుపోతుందని తెలియజేశారు.

తమిళనాడు ప్రభుత్వం ప్రతిపాదించిన తర్వాత ఈ స్టేడియం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం దేశంలోని చాలా పెద్ద సిట్టింగ్ కెపాసిటీ కలిగే ఉన్న స్టేడియం గా నిలిచిపోతుందంటూ తెలియజేస్తున్నారు.. అయితే కొన్ని నివేదికల అందుతున్న సమాచారం ప్రకారం దాదాపుగా 200 ఎకరాల విశాల విస్తీర్ణంలో ఒకేసారి రెండు లక్షల మందికి పైగా కూర్చొని క్రికెట్ చూసేలా ఈ స్టేడియాన్ని నిర్మించబోతున్నట్లు సమాచారం.. ఈ ప్రాజెక్టుకు సంబంధించి DPR ను సిద్ధం చేసేందుకు సైతం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను కూడా ఆహ్వానించిందట.

కోయంబత్తూరు నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో ఈ అంతర్జాతీయ స్టేడియాన్ని నిర్మించబోతున్నారట. అలాగే ఈ స్టేడియం పక్కన జాతీయ రహదారి NH 544 రోడ్డుకి సమీపంలో ఈ స్టేడియం కోసం స్థలాన్ని కూడా కేటాయించినట్లు తమిళనాడు వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో జైల్ల శాఖకు అక్కడ 200 ఎకరాల భూమిని సైతం ఇచ్చారని అక్కడే దీనిని తయారు చేసేలా ప్లాన్ చేస్తున్నారట.దాదాపుగా ఈ స్టేడియాన్ని తయారు చేయడానికి ఈ 200 ఎకరాల స్థలాన్ని కూడా సేకరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ స్టేడియంలో ఆటగాళ్లకు అన్ని వసతులు కూడా కల్పించే విధంగా ప్లాన్ చేస్తున్నారట. ఫైవ్ స్టార్ హోటల్స్ తో పాటు, స్పెషల్ ఇండోర్ ఫీల్డింగ్ జొన్ , ఇండోర్ ప్రాక్టీస్ , లెక్చర్ థియేటర్లో, పిచ్ క్యురేషన్ ట్రైనింగ్ ఇతర సౌకర్యాలు కూడా ఇందులో ఉండే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేస్తూందట. నరేంద్ర మోడీ అంతర్జాతీయ స్టేడియం 63 ఎకరాలు ఉండగా దీంతో పోలిస్తే ఈ కోయంబత్తూర్లో నిర్మించే స్టేడియం మూడింతలు రెట్టింపు కలదని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: