దటీజ్ నీరజ్ చోప్రా.. నిజంగా బంగారమే?
దీంతో అందరి ఆశలు గల్లంతయ్యాయి. ఈ సమయంలోనే గత ఒలంపిక్స్ లో బంగారు పతకాన్ని గెలిపించి వందేళ్ళ భారత కలను నెరవేర్చిన నీరజ్ చోప్రా పై ఆశలు పెట్టుకున్నారు అందరూ. అనుకున్నట్లుగానే అతను అద్భుతమైన ప్రదర్శన చేసి ఫైనల్ లోకి దూసుకు వెళ్ళాడు. దీంతో ఫైనల్లో తప్పకుండా విజయం సాధించి నీరజ్ చోప్రా మరో బంగారు పథకాన్ని గెలిచి తీరుతాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో ఫైనల్ లో సెకండ్ ప్లేస్ లో నిలిచిన నీరస చోప్రా సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు అన్న విషయం తెలిసిందే. దీంతో నీరజ్ గెలిచిన ఆ సిల్వర్ మెడల్.. ఇండియాకు బంగారు పతకంలా మారిపోయింది.
అయితే నీరజ్ చోప్రా కాకుండా మిగతా అందరూ క్రీడాకారులు కేవలం కాంస్య పథకాలు మాత్రమే గెలిచిన నేపథ్యంలో పారిస్ ఒలంపిక్స్ ముగింపు వేడుకలో రెండు కాంస్య పథకాలు గెలిచిన మను భాకర్ తో కలిసి నీరజ్ చోప్రా భారత పతాకదారిగా ఉండాల్సి ఉంది. అయితే ఈ విషయంలో అటు నీరజ్ చోప్రా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాడు అని చెప్పాలి. భారత హాకీ టీం కాంస్యం సాధించడంలో కీలక పాత్ర పోషించి రిటైర్మెంట్ ప్రకటించిన శ్రీ జైష్ కు భారత పతాకదారి అవకాశం ఇవ్వాలని పి.టి.ఉష సూచించగా.. తాను కూడా ఇదే విషయంపై ఆలోచిస్తున్నట్లు నీరజ్ సమాధానం ఇచ్చాడట. ఈ విషయాన్ని ఐఓఏ దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిద్దాము అంటూ నీరజ్ చెప్పారట. ఇక ఈ విషయం తెలిసి నీరజ్ క్రీడా స్ఫూర్తిగా అందరూ హాట్సాఫ్ చెబుతున్నారు. ఇక అతను సిల్వర్ గెలిచిన నిజంగా మనసు మాత్రం బంగారమే అంటూ కామెంట్ చేస్తున్నారు.