రంగు మారిన ఒలంపిక్ మెడల్.. అథ్లెట్ ఏమన్నాడో తెలుసా?

frame రంగు మారిన ఒలంపిక్ మెడల్.. అథ్లెట్ ఏమన్నాడో తెలుసా?

praveen
ప్రస్తుతం పారిస్ వేదికగా క్రీడల పండుగగా పిలుచుకునే ఒలంపిక్స్ ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఎంతో మంది క్రీడాకారులు తమ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పథకాలను గెలుచుకోవడమే లక్ష్యంగా బలిలోకి దిగుతున్నారు. అయితే ఈ ఒలంపిక్స్ క్రీడల్లో కొంతమందికి నిరాశ ఎదురవుతుంటే ఇంకొంతమంది పట్టుదలతో పోరాడి పథకాన్ని చేజిక్కించుకోగలుగుతున్నారు. కొంతమంది బంగారు పతకాన్ని చేజిక్కించుకొని ప్రపంచ ఛాంపియన్గా నిలుస్తూ ఉంటే.. కొంతమంది సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ తో సరిపెట్టుకుంటున్నారు అని చెప్పాలి.

 అయితే ఒలంపిక్స్ లాంటి విశ్వ క్రీడల్లో బంగారు పతకం మాత్రమే కాదు ఏ పథకం వచ్చినా కూడా క్రీడాకారులకు ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఒలంపిక్స్ లో పథకం గెలవడమే చాలా గొప్ప. కఠినమైన పోటీని ఎదుర్కొని పథకం వరకు చేరుకొని ఇక ఇలా మెడల్ గెలుచుకున్నాము అంటే క్రీడాకారుల ఆనందానికి అవధులు ఉండవు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఒలంపిక్స్ లాంటి క్రీడల్లో గెలిచిన పథకాన్ని క్రీడాకారులు ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇక్కడ పథకం గెలిచిన ఒక క్రీడాకారుడికి ఊహించని రీతిలో చేదు అనుభవం ఎదురయింది. అతను పథకం గెలిచి ఎంతో అపురూపంగా చూసుకుందాం అనుకుంటే.. పథకం అందుకున్న కొన్ని రోజులకి అది రంగు మారిపోయింది. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు సదరు క్రీడాకారుడు.

 పారిస్ ఒలంపిక్స్ లో గెలిచిన మెడల్స్ నాణ్యంగా లేవు అంటూ యూఎస్ఏ స్కెట్ బోర్డర్ నైజా హాస్టన్ ఆరోపించాడు. జూలై 29న జరిగిన పురుషుల స్ట్రీట్ స్కేట్ బోర్డింగ్ ఫైనల్ లో అథ్లెట్ హాస్టన్ కాంస్య పథకాన్ని గెలిచాడు. అయితే అతను అందుకున్న పథకం వారం రోజుల్లోనే పాతదైపోయింది. రంగు కూడా మారిపోయింది అంటూ సదరు అథ్లేట్ సోషల్ మీడియాలో ఫోటో పోస్ట్ చేశాడు. ఏకంగా మెడల్ యుద్ధానికి వెళ్లి వచ్చినట్లుగా కనిపిస్తుంది అంటూ కామెంట్ చేశాడు. ఇప్పటికైనా మెడల్స్ నాణ్యత పై దృష్టి సారించాలి అంటూ కోరాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: