ఒకవేళ ఐపీఎల్ లోను మెడల్స్ సిస్టమ్ ఉంటే.. ఏ జట్టు టాప్ లో ఉంటుందంటే?

frame ఒకవేళ ఐపీఎల్ లోను మెడల్స్ సిస్టమ్ ఉంటే.. ఏ జట్టు టాప్ లో ఉంటుందంటే?

praveen
ప్రస్తుతం పారిస్ వేదికగా జరుగుతున్న ఒలంపిక్స్ ఎంత ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఏ విభాగంలో ఎవరు మెడల్ సాధిస్తారు అనే విషయం గురించి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే అటు భారత క్రీడాకారులు కూడా వరుసగా వివిధ విభాగాలలో పథకాలు సాధిస్తూ అదరగొట్టేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఎన్నో అంచనాలు పెట్టుకున్న ప్లేయర్స్ ఎప్పటిలాగానే పథకాలు సాధిస్తూ ఉంటే ఇక అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కొంతమంది క్రీడాకారులు ఇలా పథకాలను సొంతం చేసుకుంటూ వార్తలలో హాట్ టాపిక్ గా మారిపోతున్నారు అని చెప్పాలి.

 అయితే ప్రస్తుతం ఎంతోమంది క్రీడాకారులు ఇలా మెడల్స్ సాధిస్తున్న నేపథ్యంలో.. ఇక మరికొన్ని విషయాలు కూడా హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. మరి ముఖ్యంగా క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా ఆలరిస్తూ ఉత్కంఠ భరితంగా సాగే ఐపిఎల్ టోర్నీ గురించి కూడా అందరూ చర్చించుకుంటున్నారు. అదేంటి ఒలంపిక్స్ లో క్రీడాకారులు మెడల్స్ సాధించడానికి.. ఇక ఐపీఎల్ టోర్నికి సంబంధం ఏముంది అని అనుకుంటున్నారు కదా. అయితే ఒలంపిక్స్ లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన క్రీడాకారులకు గోల్డ్, సిల్వర్, బ్రాండ్ మెడల్స్ ఇచ్చినట్లుగానే అటు ఐపీఎల్ లో కూడా మెడల్స్ ఇస్తే ఎవరికీ ఎన్ని మెడల్స్ వస్తాయి అన్నది చర్చించుకుంటున్నారు భారత క్రికెట్ ప్రేక్షకులు.

 ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. ఒకవేళ ఐపీఎల్లో కూడా  మెడల్స్ ఇస్తే ఇక ఐదు ట్రోఫీలు గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఐదు గోల్డ్ మెడల్స్ తో పాటు ఐదు సార్లు ఫైనల్లో నిలిచి రన్నరఫ్ గా నిలిచినందుకుగాను ఐదు సిల్వర్, ఇక మూడు రెండు సార్లు మూడో స్థానంలో నిలిచినందుకుగాను రెండు బ్రాంచ్ మెడల్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ టాప్ లో ఉంది. తర్వాత ముంబై ఇండియన్స్ ఐదు గోల్డ్, ఒక సిల్వర్ రెండు బ్రాంజ్ మెడల్స్ దక్కించుకుంటుంది. అటు తర్వాత కోల్కతా జట్టు మూడు గోల్డ్, సన్రైజర్స్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ జట్లు ఒక గోల్డ్ చొప్పున మెడల్స్ దక్కించుకుంటాయి అని చెప్పాలి. ఇక ఆర్సిబి మూడు సిల్వర్, 2 బ్రాంజ్ మెడల్స్ దక్కించుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: