కోలుకుంటున్న షమి.. రీ ఎంట్రీ ఎప్పుడో తెలుసా?

frame కోలుకుంటున్న షమి.. రీ ఎంట్రీ ఎప్పుడో తెలుసా?

praveen
టీమిండియాలో స్టార్ ఫేసర్ గా కొనసాగుతూ ఉన్నాడు మహమ్మద్ షమి. తన ఆట తీరుతో కోట్లాదిమంది అభిమానుల మనసులు గెలుచుకోగలిగాడు  అన్న విషయం తెలిసిందే. అయితే అటు ఫిట్నెస్ సమస్యలు వేధిస్తున్నప్పటికీ ఎప్పుడు గాయాలనుంచి కోలుకుంటూ పదును పెట్టిన కత్తిలా ఎప్పుడూ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి అదరగొడుతూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. గతంలో గాయం నుంచి కోలుకుని భారత జట్టులోకి వచ్చిన మహమ్మద్ షమీ ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఎంత అద్భుతమైన ప్రదర్శన చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 భారత జట్టు ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్ వరకు దూసుకెల్లగలిగింది అంటే అందుకు మహమ్మద్ షమీ కూడా ఒక కీలకమైన కారణం అని చెప్పాలి. తన పదునైన బౌలింగ్ తో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తూ.. తన స్వింగ్ బంతులతో వికెట్లు పడగొడుతూ అదరగొట్టాడు మొహమ్మద్ షమీ. అంతే కాదు వన్డే వరల్డ్ కప్ టోర్నీలో టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు అన్న విషయం తెలిసిందే. అయితే వరల్డ్ కప్ తర్వాత గాయం బారిన పడిన షమీ ఇక తర్వాత క్రికెట్ కి దూరం అయిపోయాడు. చీలమండ గాయానికి సర్జరీ కూడా చేయించుకున్నాడు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకొని.. మళ్లీ టీం ఇండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు ఈ స్టార్ ప్లేయర్.

 ఈ క్రమంలోనే అతని రీఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు అని చెప్పాలి. కాగా ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఆయన రీహాబిలేషన్ ఫైనల్ స్టేజికి చేరుకుంది.  ఈ క్రమంలోనే సెప్టెంబర్ లో బంగ్లాదేశ్ తో జరిగే టెస్టుల్లో శమీ జట్టులోకి పునరాగమనం చేయబోతున్నాడని క్రీడా వర్గాల నుంచి సమాచారం. దులీప్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్లో అయినా అతని ఆడించి.. ఫిట్నెస్ టెస్ట్ చేయాలని సెలక్టర్లు భావిస్తున్నారట. ఇక ఆ మ్యాచ్లో ఆడిన తర్వాత ఎలాంటి ఫిట్నెస్ సమస్యలు రాకపోతే నేరుగా భారత జట్టులోకి తీసుకోవాలని అనుకుంటున్నారట సెలక్టర్లు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: