100 సెంచరీలు.. సచిన్ సాధించిన ఈ రికార్డులు మాత్రం కోహ్లీ ఎప్పటికీ బ్రేక్ చేయలేడు?
టెస్ట్ ఫార్మాట్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా సచిన్ కొనసాగుతున్నాడు. ఏకంగా 200 టెస్ట్ మ్యాచ్ లు ఆడి ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ రికార్డును విరాట్ కోహ్లీ ఎంత ప్రయత్నించినా బద్దలు కొట్టడం కష్టమే. ఎందుకంటే ప్రస్తుతం విరాట్ కోహ్లీ 113 టెస్ట్ మ్యాచ్లు మాత్రమే ఆడగలిగాడు. సచిన్ రికార్డు బ్రేక్ చేయాలంటే ఇప్పటికే కెరియర్ ముగింపులో ఉన్న కోహ్లీ ఇంకా చాలా ఏళ్ళు క్రికెట్ ఆడాలి.
టెస్టుల్లో సచిన్ 15,971 పరుగులు చేశాడు ఇదే అత్యధికం. అయితే కోహ్లీ రికార్డుకు చేరువలో కూడా లేడు. ఇప్పటివరకు కోహ్లీ 8873 పరుగులు మాత్రమే చేశాడు.
సచిన్ టెండూల్కర్ 22 ఏళ్ల 91 రోజులు పాటు వన్డే ఫార్మాట్లో అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగాడు. కానీ కోహ్లీకి ఇది సాధ్యం కాదు. కోహ్లీకి ఇప్పటివరకు 15 ఏళ్ళ 913 రోజులు పూర్తయ్యాయి. కేరియర్ చివరి దశలో ఉన్న కోహ్లీకి ఇక సచిన్ రికార్డులను బ్రేక్ చేసే ఛాన్స్ అయితే లేదు. కాగా సచిన్ కెరియర్ మొత్తంలో ఆరు వండే వరల్డ్ కప్ లు ఆడాడు. ఈ రికార్డును బద్దలు కొట్టడం కోహ్లీకి అసాధ్యమే. ఎందుకంటే ఇప్పటివరకు నాలుగు వన్డే ప్రపంచకంలో భాగమయ్యాడు. సచిన్ రికార్డు బద్దలు కొట్టాలంటే 2031 ప్రపంచకప్ ఆడాల్సి ఉంది.