ధోని, రోహిత్ లలో.. ఎవరు బెస్ట్ కెప్టెన్.. రవిశాస్త్రి సమాధానమిదే?
అయితే కపిల్ దేవ్ అటు నిన్నటితరం క్రికెట్ ప్రేక్షకులకు బాగా సుపరిచితుడు. ఇక నేటి తరానికి మాత్రం ధోని, రోహిత్ శర్మలు ఇక బాగా తెలిసిన ఆటగాళ్ళు. అయితే ఈ ఇద్దరు కూడా ఎవరికి వారు విభిన్నమైన కెప్టెన్సీ తో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే వీరిద్దరిలో బెస్ట్ కెప్టెన్ ఎవరు అనే చర్చ ఎప్పుడూ భారత క్రికెట్లో జరుగుతూనే ఉంటుంది. కొంతమంది రోహిత్ శర్మ బెస్ట్ కెప్టెన్ అంటే ఇంకొంతమంది మాత్రం మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని ఎవర్గ్రీన్ బెస్ట్ కెప్టెన్ అంటూ కామెంట్లు చేస్తూ ఉంటారు. అయితే ఈ విషయంపై అటు మాజీ ఆటగాళ్లు కూడా సమాధానం చెప్పలేకపోతూ ఉంటారు అనే విషయం తెలిసిందే. కాగా ఈ విషయంపై టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి స్పందించాడు.
రోహిత్ శర్మ ఆల్ టైం దిగ్గజాలలో ఒకరు అంటూ మాజీ కోచ్ రవి శాస్త్రి ప్రశంసలు కురిపించాడు. కెప్టెన్గా వ్యూహాలు అమలు చేయడంలో అత్యుత్తమ వ్యక్తి అని.. ధోనితో పాటు బెస్ట్ కెప్టెన్లలో రోహిత్ కూడా ఒకరుగా నిలిచిపోతారు అంటూ పేర్కొన్నారు రవి శాస్త్రి. అయితే వీరిద్దరిలో ఎవరు బెస్ట్ కెప్టెన్ అని అడిగితే మాత్రం తనవరకు ఇద్దరు సమానమే అని చెబుతాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇటీవలే ముగిసిన టి20 వరల్డ్ కప్ 2024లో రోహిత్ ఆటగాడిగా కెప్టెన్గా అద్భుతంగా రాణించాడని.. ప్రపంచంలోని ఏ మైదానంలో అయినా మెరుపు ఇన్నింగ్స్ లో ఆడగల సత్తా రోహిత్ కు ఉంది అంటూ ప్రశంసించాడు.