ఐపీఎల్ 2025 : సూర్య కుమార్ పై.. కన్ను వేసిన ఆ మూడు జట్లు?
అయితే ఇప్పటికే అటు బీసీసీఐ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్లతో రిటైన్షన్ ప్రక్రియ గురించి చర్చలు జరుపుతూ ఉంది అని తెలుస్తుంది. వచ్చే మూడేళ్ల పాటు ఇదే జట్టు కొనసాగుతున్న నేపద్యంలో ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటున్నాయి అన్ని ఫ్రాంచైజీలు. ఆటగాళ్లు కూడా తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం టీమిండియా టి20 కెప్టెన్ గా సాగుతున్న సూర్య కుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టుకు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నాడు అన్నది తెలుస్తుంది. ఇప్పటికే హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడంపై సూర్య అసంతృప్తిగా ఉన్నాడట.
గతంలోనే సోషల్ మీడియా వేదికగా హార్ట్ బ్రేక్ సింబల్ పెట్టి తన అసంతృప్తిని తెలియజేశాడు. కెప్టెన్సీ కోసం అతను మెగా వేలం లోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ సూర్యకుమార్ యాదవ్ వేలం లోకి వస్తే ఏకంగా మూడు జట్లు అతని కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి. అలాంటి టీమ్స్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ముందు స్థానంలో ఉంది అనేది తెలుస్తుంది. ఆ జట్టు టైటిల్ కలను నెరవేర్చుకునేందుకు కొత్త కెప్టెన్ ను ఎంచుకోవడంపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఆ జట్టు కెప్టెన్గా ఉన్న డూప్లెసెస్ ను.. ఇక టీం వేలంలోకి వదిలేసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే సూర్య కుమార్ యాదవ్ వేలంలోకి వస్తే అతని కోసం ఎంత ఖర్చు చేసి అయినా జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
ఇప్పటివరకు సరైన కెప్టెన్ లేక ఇబ్బంది పడుతున్న పంజాబ్ కింగ్స్ కూడా సూర్యకుమార్ ని తీసుకునేందుకు ప్రణాళికలు రచిస్తుంది. సూర్య కోసం కోట్లు కుమ్మరించేందుకు కూడా రెడీగా ఉందట. మరోవైపు లక్నో జట్టు కూడా కొత్త కెప్టెన్ కోసం వేట మొదలు పెట్టగా.. సూర్యను తీసుకుంటే బాగుంటుందని ఆ జట్టు యాజమాన్యం అనుకుంటుందట. మరి టీమ్ ఇండియా టి20 కెప్టెన్ గా ఉన్న సూర్య ఏ టీమ్ లోకి వెళ్తాడో చూడాలి.