T20 కెప్టెన్ గా సూర్యకుమార్.. అక్షర్ పటేల్ ఏమన్నాడంటే?

praveen
ఇండియన్ క్రికెట్లో టి20 ఫార్మాట్లో కొత్త శకం మొదలైంది. ఎందుకంటే ఇటీవల వెస్టిండీస్ యూఎస్ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ 2024 ఎడిషన్ లో టీమిండియా వరల్డ్ కప్ విజేతగా నిలిచింది అన్న విషయం తెలిసిందే. రోహిత్ కెప్టెన్సీ లో బరిలోకి దిగిన భారత జట్టు అసమాన్యమైన ప్రదర్శన చేసి టైటిల్ అందుకోగలిగింది. ఏకంగా పొట్టి ఫార్మాట్లో 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ  ఇక వరల్డ్ కప్ ట్రోఫీనీ ముద్దాడింది. అయితే ఈ వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచిన వెంటనే రోహిత్ శర్మ తన అంతర్జాతీయ టి20 కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో పొట్టి ఫార్మాట్లో టీమ్ ఇండియాకు కొత్త కెప్టెన్ అవసరం ఏర్పడింది.

 ఇక కొత్త సారధిగా ఎవరిని నియమిస్తారు అనే విషయంపై చర్చ జరగగా.. హార్దిక్ పాండ్యా పేరు బలంగా వినిపించింది. కానీ భారత సెలక్టర్లు మాత్రం అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. భారత జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న సూర్య కుమార్ యాదవ్ చేతికి టి20 కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతని కెప్టెన్సీ లోనే మరికొన్ని రోజుల్లో టీమిండియా కొత్త శకాన్ని t20 ఫార్మాట్లో మొదలు పెట్టబోతుంది అని చెప్పాలి. కాగా ఇలా సూర్యకుమార్ యాదవ్ కొత్త కెప్టెన్ గా ఎంపిక కావడంపై భారత జట్టులోని ఆటగాళ్లు స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

 ఈ క్రమంలోనే భారత్ కొత్త టీ20 కెప్టెన్గా సూర్య కుమార్ యాదవ్ ఎంపిక అవడం గురించి ఆల్ రౌండర్ అక్షర పటేల్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏకంగా సూర్య కుమార్ యాదవ్ పై ప్రశంసలు కురిపించాడు. సూర్య కెప్టెన్సీ లో నేను గతంలో ఆడాను. అతను బౌలర్ల కెప్టెన్. బౌలర్లు కోరినట్లు ఫీల్డ్ ని సెట్ చేస్తాడు. పరిస్థితులను ప్రశాంతంగా ఉంచుతాడు  మిమిక్రీ తో పాటు ఫన్ ఇష్టపడే సూర్య కుమార్ ఎప్పుడు సంతోషంగానే ఉంటాడు అంటూ ఇటీవలే అక్షర పటేల్ చెప్పుకొచ్చాడు. అయితే సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీ లోనే భారత జట్టు జూలై 27వ తేదీ నుంచి టి20 సిరీస్ ఆడబోతుంది  చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: