ఇదెక్కడి విడ్డూరం.. జ్యూస్ షాప్ లో ఉద్యోగం కోసం డిగ్రీ కావాలట?

praveen
ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రపంచమంతా పాకిపోయింది. దీంతో ఎక్కడ ఎలాంటి విచిత్రకరమైన ఘటన జరిగిన కూడా అది ఇంటర్నెట్లో తెగ వైరల్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలాంటి తరహా ఘటనల గురించి తెలుసుకునేందుకు ఇంటర్నెట్ జనాలు తెగ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి విచిత్రకరమైన ఘటన గురించే. ఏకంగా ఒక వ్యక్తి తన షాపులో జాబ్ వేకెన్సీ ఉంది అంటూ ప్రకటన విడుదల చేశారు  ఇక ఇదే ప్రస్తుతం సోషల్ మీడియా జనాలను ఆశ్చర్యపరుస్తుంది.

 అయితే ఈ మధ్యకాలంలో ఎంతోమంది వ్యాపారులు తమ బిజినెస్ కు సంబంధించి ఏదైనా ప్రకటన చేయాలంటే సోషల్ మీడియా వేదికగా చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇక ఎవరినైనా పనిలో చేర్చుకోవాలి అనుకుంటే వారికి కావాల్సిన అర్హతలు ఏంటి అన్న విషయాన్ని కూడా ప్రకటనలో తెలుపుతున్నారు. ఇక ఎక్కువ మంది ఇలా గ్రాడ్యుయేట్లను కూడా తీసుకుంటూ ఉండటం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఒక వ్యక్తి డిగ్రీ పూర్తి చేసిన వారు ఉద్యోగం కోసం తనను సంప్రదించాలి అంటూ ప్రకటన చేశాడు. డిగ్రీ అంటున్నాడు అంటే ఏదో పెద్ద ఉద్యోగమే అనుకుంటున్నారు కదా. అలా అనుకున్నారు అంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే అతను ఇలా డిగ్రీ అర్హత కావాలన్నది ఏకంగా జ్యూస్ సెంటర్లో పని చేయడానికి.

 వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. కానీ ఈ ఘటన నిజంగానే జరిగింది. జ్యూస్ షాప్ లో పనిచేయడానికి అర్హతలు ఏంటి మహా అయితే జ్యూస్ చేయడం వస్తే చాలు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం డిగ్రీ కూడా ఉండాలి అంటున్నాడు. తమిళనాడుకు చెందిన ఒక షాపు యజమాని దుకాణంలో పని చేసేందుకు బిఈ, బిఏ బిఎస్సి చదివిన వారు కావాలని.. రూ. 18000 జీతం ఇస్తానని ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు పని ఉంటుందని తెలిపాడు. అయితే తూత్తుకుడి జిల్లాలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియా జనాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: