టి20 కెప్టెన్సీ రావడంపై.. తొలిసారి స్పందించిన సూర్య.. ఏమన్నాడంటే?

praveen
ఇటీవల వెస్టిండీస్ యూఎస్ వేదికగా జరిగిన 2024 t20 వరల్డ్కప్ టోర్నీలో టీమిండియా అద్భుతమైన ప్రదర్శన చేసి టైటిల్ విజేతగా నిలిచింది. దాదాపు పొట్టి ఫార్మాట్లో 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత.. ఇలా ప్రపంచకప్ టైటిల్ ను ముద్దాడగలిగింది టీమిండియా. అయితే ఇలా వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన వెంటనే టీమిండియా కెప్టెన్గా కొనసాగుతున్న రోహిత్ శర్మ సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీలు అంతర్జాతీయ టి20 కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో టీమిండియాకు t20 ఫార్మాట్ లో కొత్త కెప్టెన్ ను వెతుక్కోవాల్సిన పరిస్థితి బీసీసీఐ సెలెక్టెర్లకు ఏర్పడింది.

 అయితే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఇక భారత జట్టుకు కాబోయే నూతన టి20 కెప్టెన్ ఎవరు అనే విషయంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే మొన్నటి వరకు రోహిత్ శర్మకు డిప్యూటీగా కొనసాగిన హార్దిక్ పాండ్యానే కొత్త టి20 కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని అందరూ అంచనా వేశారు. కానీ ఊహించని రీతిలో ఏకంగా భారత జట్టులో స్టార్ క్లియర్గా కొనసాగుతున్న సూర్య కుమార్ యాదవ్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది సెలక్షన్ కమిటీ. అయితే అప్పటి వరకు అసలు కెప్టెన్సీ రేసులోనే లేని సూర్యకు ఇలా సారథ్యం అప్పగించడంతో అందరూ ఆశ్చర్యం లో మునిగిపోయారు అని చెప్పాలి.

 కాగా తనకు టి20 కెప్టెన్సీ బాధ్యతలు దక్కడంపై సూర్యకుమార్ యాదవ్ మొదటిసారి స్పందించాడు. నాపై అభిమానులు చూపిస్తున్న అమితమైన ప్రేమకు ధన్యవాదాలు. దేశం కోసం ఆడటం అనేది ఒక ప్రత్యేకమైన ఫీలింగ్. దాన్ని మాటల్లో వర్ణించలేను. కెప్టెన్సీ రావడం నాలో కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడంతో పాటు బాధ్యతను కూడా పెంచింది. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్న. గాడ్ ఇస్ గ్రేట్ అంటూ సూర్య కుమార్ యాదవ్ సోషల్ మీడియాలో టీమిండియా  కెప్టెన్సీ రావడంపై ఒక పోస్ట్ పెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: