వారెవ్వా.. పాక్ ఫై టీమిండియా గ్రాండ్ విక్టరీ?
ఈ క్రమంలోనే అటు పాకిస్తాన్ ఇటు ఇండియా ఒక దేశ పర్యటనకు మరొక దేశం వెళ్లడం అస్సలు జరగదు. కేవలం ఆసియా కప్, వరల్డ్ కప్ లాంటి టోర్నీలలో మాత్రమే ఈ రెండు టీమ్స్ తలబడుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక చిరకాల ప్రత్యర్థులుగా పిలుచుకునే ఈ రెండు టీమ్స్ మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగిన.. అది హై వోల్టేజ్ మ్యాచ్ గా మారిపోతూ ఉంటుంది. నువ్వా నేనా అన్నట్లుగా సాగే పోరులో ఎవరు విజయం సాధిస్తారు అన్న విషయాన్ని తెలుసుకునేందుకు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. కాగా మొన్నటికీ మొన్న జరిగిన టి20 వరల్డ్ కప్ లో కూడా అటు ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచింది అని చెప్పాలి.
అయితే ఇటీవల మరోసారి ఈ దయాదుల సమరం జరిగింది అని చెప్పాలి. మహిళల ఆసియా కప్ టి20 టోర్నీలో భాగంగా గ్రూప్ ఏ తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్ధులు అయిన పాకిస్తాన్, ఇండియా మధ్య మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ ఘనవిజయాన్ని సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 109 పరుగులకే పరిమితమైంది. అయితే స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 14.1 ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది. స్మృతి మందాన 45, శాపాలి వర్మ 40 కీలక ఇన్నింగ్స్ ఆడారు. కాగా ఇలా చిరకాల ప్రత్యర్థి పై ఇండియా ఘన విజయాన్ని సాధించడంతో టీమ్ ఇండియా ఫ్యాన్స్ అందరూ కూడా సంతోషంలో మునిగిపోతున్నారు.