బీసీసీఐ షాకింగ్ డెసిషన్.. టి20లకి కొత్త కెప్టెన్ ఎవరంటే?

praveen
వెస్టిండీస్, యూఎస్ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ 2024 ఎడిషన్ లో భారత జట్టు వరల్డ్ కప్ టైటిల్ విజేతగా నిలిచింది అన్న విషయం తెలిసిందే. బరిలోకి దిగి అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఒక్క ఓటమి కూడా లేకుండా ఏకంగా టైటిల్ ను చేజెక్కించుకోగలిగింది అని చెప్పాలి. వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన వెంటనే రోహిత్ శర్మ ఏకంగా తన అంతర్జాతీయ టి20 కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో భారత జట్టుకు కొత్త టీ20 కెప్టెన్ ఎవరు అనే విషయంపై చర్చ జరిగింది.

 అయితే వరల్డ్ కప్ వరకు కూడా ఆటు రోహిత్ శర్మకు డిప్యూటీగా ఉన్న హార్దిక్ పాండ్యానే ఇక కొత్త కెప్టెన్ గా నియమించే అవకాశం ఉంది అని ఎంతోమంది అనుకున్నారు. ఎందుకంటే గతంలో రోహిత్ రెస్ట్ తీసుకున్న ప్రతిసారి కూడా హార్దిక్ పాండ్యాకే t20 కెప్టెన్సీ దక్కింది. ఇక అతనికి కెప్టెన్సీలో కూడా అనుభవం ఉండడంతో.. భారత జట్టు సారధ్య బాధ్యతలు అతని చేతికి వెళ్లే అవకాశం ఉంది అని అందరూ అంచనా వేశారు. కానీ బీసీసీఐ సెలెక్టర్లు మాత్రం అనూహ్యంగా మరో నిర్ణయం తీసుకున్నారు. జట్టులో స్టార్ బాట్స్మన్ గా కొనసాగుతున్న సూర్య కుమార్ యాదవ్ చేతికి టి20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఇటీవలే కెప్టెన్గా సూర్యకుమార్ ను అధికారికంగా ప్రకటించారు.

 శ్రీలంకతో ఈనెల 27వ తేదీ నుంచి జరగబోయే మూడు మ్యాచ్ల టి20 సిరీస్ కు ఇటీవలే భారత జట్టును బీసీసీఐ సెలెక్టరు ప్రకటించారు. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా కు కెప్టెన్సీ బాధ్యతలు దక్కుతాయని అందరూ ఊహించగా.. అనూహ్యంగా సూర్య కుమార్ యాదవ్ చేతికి కెప్టెన్సీ అప్పగించారు. అయితే కనీసం ఇక అటు హార్దిక్ పాండ్యాకు వైస్ కెప్టెన్సీ కూడా అప్పగించకపోవడం గమనార్హం. ఏకంగా వైస్ కెప్టెన్ గా  శుభమన్ గిల్ కి అవకాశం కల్పించారు. దీంతో హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ లో మునిగిపోతున్నారు. మరి కెప్టెన్సీ విషయంలో రానున్న రోజుల్లో ఏమైనా మార్పులు ఉంటాయా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: