హార్దిక్ కెప్టెన్సీ పోవడానికి.. విడాకులే కారణమా?

praveen
టీమిండియాలో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతూ ఉన్నాడు హార్దిక్ పాండ్యా. ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన హార్దిక్ పాండ్యా జట్టులో ఉన్నాడు అంటే అదనపు బౌలర్ తో పాటు అదనపు బ్యాట్స్మెన్ కూడా ఏకంగా టీమ్ లో ఉన్నట్లుగా మారిపోతుంది పరిస్థితి. ఎందుకంటే అతను ఫాస్ట్ బౌలింగ్ తో పాటు ప్రత్యర్థులను బెంబేలెత్తించడమే కాదు మరోవైపు బ్యాటింగ్ తో కూడా విధ్వంసం సృష్టిస్తూ ఉంటాడు అని చెప్పాలి. అందుకే అతనికి కొన్నిసార్లు విఫలమైన కూడా సెలెక్టర్లు వరుసగా టీమిండియాలో ఛాన్సులు ఇస్తూనే ఉంటారు.

 గత కొంతకాలం నుంచి కెప్టెన్ రోహిత్ శర్మకు డిప్యూటీగా కూడా కొనసాగుతూ వస్తున్నాడు హార్దిక్ పాండ్య. దీంతో ఇక అతనికి రోహిత్ తర్వాత కెప్టెన్సీ హార్దిక్ పాండ్యా కి దక్కే  అవకాశం ఉందని అందరూ అంచనా వేశారు. కానీ ఊహించని రీతిలో హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్ ఇచ్చింది బీసీసీఐ. ఎందుకంటే త్వరలో హార్దిక్ పాండ్యాను పూర్తిస్థాయి టీ20 కెప్టెన్ గా అటు బీసీసీఐ ప్రకటించబోతుంది అని అందరూ అనుకుంటున్న సమయంలో అటు భారత సెలెక్టర్లు మాత్రం హార్దిక్ ను కాదని సూర్య కుమార్ యాదవ్ కు కెప్టెన్సీ అప్పగించారు. దీంతో భారత క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయారు అని చెప్పాలి.

 అయితే ఇక ఇప్పుడు హార్దిక్ ను ఎందుకు కెప్టెన్సీ ఇవ్వలేదు అనే విషయంపై చర్చ జరుగుతూ ఉండగా.. విడాకులు అంశమే ఇందుకు కారణం అని కొంతమంది నిపుణులు అంచనాలు వస్తున్నారు. ఎందుకంటే ఇటీవల తన భార్య నటాషాతో హార్దిక్ విడాకులు తీసుకున్నాడు  అయితే విడాకుల సమయంలో కాస్త మెంటల్ డిస్టబెన్స్ ఉండడం సహజం. ఈ క్రమంలోనే ఇలాంటి సమయంలో కెప్టెన్సీ చేపట్టి ఇక టీమిండియాను సరిగ్గా ముందుకు నడిపించక ఇబ్బంది పడటం కంటే.. ఇక కొన్నాళ్లపాటు కెప్టెన్సీ కి దూరంగా జట్టులో సాదాసీదా ఆటగాడిగా ఉండడమే మేలు అని హార్దిక్ భావించి సెలెక్టర్లకు ఈ విషయం చెప్పి ఉంటాడని.. అందుకే హార్దిక్ ను కనీసం వైస్ కెప్టెన్ గా కూడా నియమించకుండా ఒక సాదా సీదా ప్లేయర్ కి లాగానే జట్టులోకి తీసుకొని సూర్య కుమార్కు కెప్టెన్సీ అప్పగించి ఉంటారని అంచనా వేస్తున్నారు. మరి ఏది నిజం అన్నది మాత్రం మరికొన్ని రోజులు గడిస్తే గాని ఎవరికీ తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: