టీమిండియా మాజీఫై కేసు.. ఇంతకీ ఏం జరిగిందంటే?
ఒకప్పుడు తమ ఆట తీరుతో ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుని కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న మాజీ క్రికెటర్లు ఇక ఇప్పుడు సరదాగా చేసిన పని ఎంతోమందికి కోపం తెప్పిస్తుంది. కోపం తెప్పించడమే కాదు ఏకంగా ఈ ముగ్గురు క్రికెటర్ల పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యేవరకు పరిస్థితిని తీసుకువచ్చింది అని చెప్పాలి. దీంతో ఈ మాజీ క్రికెటర్లపై ఎంతో మంది విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇలా పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యే పరిస్థితిని కొని తెచ్చుకున్న మాజీ క్రికెటర్లు ఎవరో కాదు.. ఒకప్పుడు తమ ఆట తీరూతో ఎంతగానో ఆకట్టుకున్న యువరాజ్ సింగ్, సురేష్ రైనా, హర్భజన్ సింగ్ లు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇటీవలే వరల్డ్ లెజెండ్స్ ఛాంపియన్షిప్ ట్రోఫీలో భారత జట్టు పాకిస్తాన్ ఓడించింది అన్న విషయం తెలిసిందే.
ఇలా ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ ఓడించి ఏకంగా టైటిల్ విజేతగా నిలిచింది. దీంతో ఇక భారత మాజీ ఆటగాళ్లందరూ కూడా సంబరాల్లో మునిగిపోయారు. ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే భారత మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, సురేష్ రైనా, హర్భజన్ సింగ్ లు ఏకంగా కుంటూతూ సెలబ్రేట్ చేసుకున్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో వీరు వైకల్యం కలిగిన వారిని హేళన చేసే విధంగా ప్రవర్తించారు అంటూ ఆర్మాన్ అలీ ఢిల్లీలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఇలా ముగ్గురు మాజీ క్రికెటర్ల పై కేసు నమోదు కావడం సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.