వార్నర్ కు బిగ్ షాట్.. అలాంటి ఆలోచన లేదన్న క్రికెట్ ఆస్ట్రేలియా?

praveen
ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ అయినా డేవిడ్ వార్నర్ కు అంతర్జాతీయ క్రికెట్ లో ఎంత మంచి గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా ఇండియాలో అయితే డేవిడ్ వార్నర్ ను ఏకంగా స్వదేశీ క్రికెటర్ గా అభిమానిస్తూ ఉంటారు క్రికెట్ ప్రేక్షకులు. మరీ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు అయితే  సొంతింటి వ్యక్తి లాగానే అటు డేవిడ్ వార్నర్ ను ఫీల్ అవుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఆస్ట్రేలియా జట్టు తరఫున మూడు ఫార్మట్లలో కూడా దాదాపు దశాబ్ద కాలానికి పైగానే స్టార్ ప్లేయర్గా హవా నడిపించాడు డేవిడ్ వార్నర్.

 తన అద్భుతమైన ఆట తీరుతో ఆస్ట్రేలియాకు ఎన్నో మరపురాని విజయాలను అందించాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇలాంటి స్టార్ ప్లేయర్ ను ఏ క్రికెట్ బోర్డు అయినా సరే ఎంతో అపురూపంగా చూసుకుంటుంది. కానీ డేవిడ్ వార్నర్ విషయంలో మాత్రం క్రికెట్ ఆస్ట్రేలియా మొదటి నుంచి  పక్షపాత ధోరణితోనే వ్యవహరిస్తుంది. గతంలో బాల్ టాంపరింగ్ వ్యవహారంలో చిక్కుకున్న డేవిడ్ వార్నర్ పై ఏకంగా జీవితకాల కెప్టెన్సీ నిషేధం విధించింది. దీంతో అతని సహచరులు అతని జూనియర్లకు కెప్టెన్సీ దక్కింది తప్ప డేవిడ్ వార్నర్ కి మాత్రం సారధ్య బాధ్యతలు ఒక్కసారి కూడా దక్కలేదు.

 ఈ విషయంపై డేవిడ్ వార్నర్ ఎన్నిసార్లు తన అసంతృప్తిని వెళ్లగక్కిన క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం అస్సలు పట్టించుకోలేదు. అయితే డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటర్మెంట్ ప్రకటించారు. అయితే ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు డేవిడ్ వార్నర్. ఆస్ట్రేలియా జట్టుకు ఒకవేళ తన సేవలు అవసరమైతే తన రిటైర్మెంట్ వెనక్కి తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నాను అంటూ డేవిడ్ వార్నర్ వ్యాఖ్యానించాడు. ఏకంగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో తాను ఆస్ట్రేలియా తరఫున ఆడేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు.

 అయితే క్రికెట్ ఆస్ట్రేలియాలో లెజెండరీ ప్లేయర్గా కొనసాగుతున్న డేవిడ్ వార్నర్ విషయంలో ఆ దేశ క్రికెట్ బోర్డు మరోసారి పక్షపాత ధోరణితోనే వ్యవహరించింది. డేవిడ్ వార్నర్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడటానికి తాను రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవడానికి కూడా సిద్ధమే అంటూ చెప్పగా.. డేవిడ్ వార్నర్ను అసలు ఛాంపియన్స్ ట్రోఫిలో పరిగణలోకి తీసుకోబోము అంటూ ఆస్ట్రేలియా సెలెక్టర్ బెయిలీ స్పష్టం చేశారు. అతని కెరియర్ విజయవంతంగా సాగింది అంటూ చెప్పుకొచ్చారు. మూడు ఫార్మాట్లకు ఆయన సేవలు అందించిన.. ప్రస్తుతం జట్టు వేరువేరు ఆటగాళ్లతో వెళుతుంది తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: