కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్ పై.. వివిఎస్ లక్ష్మణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

praveen
ఇటీవలే వెస్టిండీస్, యుఎస్ వేదికలుగా జరిగిన టి20 వరల్డ్ కప్ 2024 ఎడిషన్ లో భారత జట్టు అద్భుతమైన ప్రస్తానాన్ని కొనసాగించింది. రోహిత్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా ఒక్క ఓటమి కూడా లేకుండా వరల్డ్ కప్ టైటిల్ ను ముద్దాడగలిగింది అని చెప్పాలి. అప్పుడెప్పుడో టి20 ఫార్మాట్ వరల్డ్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు జరిగిన 2007 t20 వరల్డ్ కప్ గెలుచుకున్న టీమిండియా ఇక తర్వాత ఒక్కసారి కూడా ఈ ఫార్మాట్లో ట్రోఫీ అందుకోలేకపోయింది. దీంతో 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఇక ఇటీవలే మరోసారి విశ్వ విజేతగా అవతరించింది అన్న విషయం తెలిసిందే.

 అయితే ఈ వరల్డ్ కప్ ట్రోఫీ గెలవడంతో అటు భారత క్రికెట్ ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయ్. కానీ ఈ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ఏకంగా ఈ వరల్డ్ కప్ గెలవడానికి ఎంతగానో శ్రమించినా కెప్టెన్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలు తమ అంతర్జాతీయ టి20 కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో అభిమానులు షాక్ అయ్యారు. టీమిండియా వరల్డ్ కప్ గెలిచిందని సంతోషపడాలా లేకపోతే అభిమాన క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించారని బాధపడాలా అర్థం కాని అయోమయ పరిస్థితిలో పడిపోయారు అని చెప్పాలి. దీంతో భారత జట్టు వరల్డ్ కప్ గెలిచినప్పటికి ఈ ఇద్దరు లెజెండరి ప్లేయర్స్ రిటైర్మెంట్ మాత్రం అభిమానులకు బాధనే మిగిల్చింది అనడంలో సందేహం లేదు.

 ఆ మరునాడే మరో సీనియర్ ప్లేయర్ రవీంద్ర జడేజా కూడా అంతర్జాతీయ టి20 లకు రిటైర్మెంట్ ప్రకటించేసాడు. ఇలా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు అంతర్జాతీయ టి20 కేర్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో.. బాధలో ఉన్న అభిమానులందరికీ కూడా కాస్త ఉపశమనం కలిగించే విధంగా ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు టీమిండియా తాత్కాలిక కోచ్ మాజీ ప్లేయర్ వివిఎస్ లక్ష్మణ్. టి20 లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఆ ముగ్గురు ప్లేయర్లు ఇంకా చాలా కాలం క్రికెట్ ఆడతారు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. వన్డే టెస్ట్ ఫార్మట్ లలో వారి సేవలు ఎంతో అమూల్యమైనవి. ఆ ఫార్మర్లలో ఆ ముగ్గురు కూడా దేశానికి మరిన్ని ట్రోఫీలు తెచ్చేందుకు సిద్ధంగా ఉంటారని అనుకుంటున్నా అంటూ వివిఎస్ లక్ష్మణ్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: