కోహ్లీ పాకిస్తాన్ కు వస్తే.. ఇండియాని మరిపిస్తాం : ఆఫ్రిది

praveen
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి వరల్డ్ క్రికెట్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  అందరిలాగానే అతను కూడా ఒక సాదాసీదా క్రికెటర్ లాగా భారత జట్టులోకి వచ్చాడు. కానీ ఊహించని రీతిలో తక్కువ సమయంలోనే తన ఆటతీరుతో అందరిని ఇంప్రెస్ చేసేసాడు. ఇక మూడు ఫార్మట్లలో కూడా కీలక ప్లేయర్ గా మారిపోయాడు అని చెప్పాలి. అంతేకాదు ఎంతోమంది లెజెండరి ప్లేయర్స్ కెరియర్ కాలం మొత్తంలో సాధించిన రికార్డులను అతి తక్కువ సమయంలోనే బద్దలు కొడుతూ ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ  చేత రికార్డుల రారాజు అని పిలిపించుకున్నాడు విరాట్ కోహ్లీ.

 ఈ క్రమంలోనే అద్భుతమైన ఆట తీరుతో ఎప్పుడు ఇక టాక్ ఆఫ్ ది వరల్డ్ క్రికెట్ గా మారిపోతూ ఉంటాడు అని చెప్పాలి   అయితే ఇక విరాట్ కోహ్లీ అభిమానించే ఫ్యాన్స్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. ఇండియాలో ఎలా అయితే కోట్లాదిమంది కోహ్లీ ఆటను చూసి మైమరిచిపోతారో.. ఇక ప్రపంచవ్యాప్తంగా ఏ దేశానికి వెళ్లిన కోహ్లీ అభిమానులు కనిపిస్తూ ఉంటారు  అయితే భారత పొరుగు దేశమైన దాయాది పాకిస్తాన్లో కూడా ఇలా కోహ్లీ అభిమానులు చాలామంది ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే తమ దేశ పర్యటనకు టీమిండియా వచ్చి కోహ్లీ మన దేశంలో మ్యాచ్లు ఆడితే చూడాలని ఎంతోమంది కోరుకుంటూ ఉంటారు. కానీ క్రికెట్ సంబంధమైన నిషేధం ఉన్న నేపథ్యంలో  ఇలాంటిది సాధ్యం కాదు.

 అయితే ఇదే విషయం గురించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు  కోహ్లీ పాకిస్థాన్లో క్రికెట్ ఆడితే చూడటానికి ఎంతో మంది ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. విరాట్ కి పాకిస్తాన్ లో ఎంతో మంది ఫాన్స్ ఉన్నారు. అతను మా దేశానికి వస్తే ఇండియాలోని ఆతిథ్యాన్ని మర్చిపోతారు. అంత గొప్పగా కోహ్లీని చూసుకుంటాం అంటూ చెప్పుకొచ్చాడు. అయితే వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడు ఎందుకు భారత్ పాకిస్తాన్ పర్యటనకు రావాలని ఆదేశం క్రికెట్ బోర్డు కోరుకుంటూ ఉండగా ఎందుకు బీసీసీఐ మాత్రం ఒప్పుకోవడం లేదు తమ జటు ఆడే మ్యాచ్లను తటస్థ వేదికలో నిర్వహించాలని డిమాండ్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: